ఆంధ్రప్రదేశ్‌

ఒక్కొక్కరిది.. ఒక్కో విషాద ఉదంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 28: కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృత్యువాత పడిన ప్రయాణికుల కుటుంబాలు తీరని శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిని చూసి తమ కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. కొన్ని గంటల ముందు ఆనందంగా తమతో గడిపిన తమ వారిని ఇంత ధైన్యంగా చూడాల్సిన దుస్థితి ఏర్పడటాన్ని జీర్ణించుకోలేని బాధిత కుటుంబాలు తల బాదుకున్నారు. ఈ విషాద ఉదంతం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికుల కంట నీరు ఆగలేదు. ప్రమాదంలో మృత్యువాత పడిన కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదం..
మరో 15నిముషాల్లో దిగుతారు..
ఇంతలోనే..
అవును ఆ.. సోదరులిద్దరూ మరో 15నిముషాల్లో బస్సు దిగిపోతారు. తమ వారు వేచియున్న కారులో క్షేమంగా గమ్యానికి చేరుకుని కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవాలనుకున్నారు. సుదూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న తుమ్ముడిని ఇంటికి తోడ్కొని వస్తూ మార్గమధ్యలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పాపం వారికి తెలీదు.. తాము మృత్యు ఒడిలోకి ప్రయాణం సాగిస్తున్నామని. సూర్యారావుపేట గరిడేపల్లి మండలం కోదండరామపురం గ్రామానికి చెందిన నలబోతు శేఖర్‌రెడ్డి, నలబోతు కృష్ణారెడ్డి అనే అన్నదమ్ములిద్దరూ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. తమ్ముడు శేఖర్‌రెడ్డి ఒడిశాలో సీఆర్‌పిఎఫ్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అన్న కృష్ణారెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. తమ్ముడిని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఒడిశా వెళ్లిన అన్న సోమవారం ఉదయం 11 గంటలకు భువనేశ్వర్ నుంచి దివాకర్ ట్రావెల్స్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. బస్సు కృష్ణాజిల్లా నందిగామ వద్దకు రాగానే కృష్ణారెడ్డి తన బంధువుకు ఫోన్ చేసి మరో పావు గంటలో కోదాడ వద్దకు కారు తీసుకుని రావాలని సమాచారం ఇచ్చారు. ఇంతలోనే మూలపాడు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో కృష్ణారెడ్డి సంఘటనాస్ధలంలో మృతి చెందగా, శేఖర్‌రెడ్డి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భార్యను రైలెక్కించి..
కొడుకుతో బస్సెక్కి..
బస్సు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ వాసి కోట మధుసూదనరెడ్డి విషాద ఉదంతం కలిచివేస్తోంది. భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. అయితే భార్యను రైలెక్కించి.. కొడుకుతో కలిసి బసెక్కి మృత్యువాత పడ్డాడు. భార్యను భువనేశ్వలో హైదరాబాద్ రైలెక్కించిన తర్వాత కొడుకు అభిషేక్‌రెడ్డితో కలిసి దివాకర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మధుసూదన్‌రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. కుమారుడు అభిషేక్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే రైలులో హైదరాబాద్ చేరుకున్న భార్యకు ఈ విషయం తెలియగానే బోరున విలపిస్తూ అక్కడే రైల్వేస్టేషన్‌లో కుప్పకూలిపోయింది. వెంటనే హటాహుటిన హైదరాబాద్ స్టేషన్ నుంచే బస్సు ప్రమాద ఘటనాస్ధలికి బయలుదేరింది. ఇలా ప్రమాద బారిన పడిన మృతుల, క్షతగాత్రుల కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద ఉందంతంతో తల్లడిల్లిపోతున్నారు.
కూతుర్ని కొత్త కాపురానికి తీసుకెళ్తూ....తల్లి మృతి

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: హైదరాబాద్‌లో కూతురితో కొత్తకాపురం పెట్టించేందుకు వెళ్తుండగా జిల్లాలోని సంతబొమ్మాళి మండలానికి చెందిన పొన్నాడ తులసమ్మ (43) కృష్ణా జిల్లా నందిగామ వద్ద మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందింది. కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన తులసమ్మ కూమర్తె రేవతికి చొక్కాపుల కిరణ్‌తో కొద్దిరోజుల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కిరణ్, రేవతిలతో కొత్తకాపురానికి తీసుకెళ్తున్న రేవతి తల్లి తులసమ్మ ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచిపెట్టడం అచ్చెన్న నియోజకవర్గంలో విషాదం అలుముకుంది. కూమార్తె, అల్లుడితో హైదరాబాద్‌లో కొత్త కాపురం పెట్టించేందుకు వారితో కలిసి సోమవారం రాత్రి తులసమ్మ పెద్దదిక్కుగా బయలుదేరింది. దివాకర్ ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా ముళ్ళపాడు వద్ద జరిగిన ప్రమాదంలో తులసమ్మ కూతురి కాపురం చూడకుండానే ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనలో తులసమ్మ కూరుతు రేవతి, అల్లుడు కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ప్రమాదంలో కిరణ్‌కు ఎముకులు విరిగినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు వారు చెప్పుకొస్తుండగా, రేవతి తలకు బలమైన గాయమైందని తెలిసింది. వీరిద్దరకీ ప్రాణనష్టం కలిగేంతటి గాయాలు లేవంటూ అక్కడ వైద్యాధికారులు ఇచ్చిన సమాచారమని సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామపెద్దలు వివరించారు. మృతురాలు తులసమ్మ కుటుంబానికి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఒడిశా ప్రయాణికులు బాలదేవ్‌సింగ్, లక్ష్మీనాయుడు, ఎ.అచ్యుతరావు, టెక్కలి నుంచి ముగ్గురు, శ్రీకాకుళం నుంచి 14 మంది హైదరాబాద్‌కు ప్రయాణం చేసేందుకు ఎక్కారు. వీరిలో తులసమ్మ ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందగా, కిరణ్, రేవతి, ఎం.యుగంధర్, ఎం.కమల, భార్గవి, ఆర్.దిలీప్‌కుమార్, బి.దినేష్, బి.వాసుదేవరావు, డి.సందీప్, ఎస్.గణేష్ గొల్లపూడి ఆసుపత్రిలో క్షతగాత్రులుగా చికిత్స పొందుతున్నారు.

మృతురాలు పొన్నాడ తులసమ్మ (ఫైల్‌ఫొటో)