ఆంధ్రప్రదేశ్‌

నమ్మకం పెంచుకున్న నారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 28: ‘వైఎస్ మాదిరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. నమ్మిన వారికి న్యాయం చేసే అలవాటు, ఆయన మాదిరిగా తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్న వారిని గుర్తుంచుకుని చెప్పకుండా, ఎదుటివారు అడగకుండానే మేలు చేసే పెద్ద మనసు లేదు. వాడుకుని వదిలేసే నైజమే మా నాయకుడికి మైనస్’ అంటూ ఇప్పటివరకూ సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆ ముద్రను విజయవంతంగా తొలగించుకున్నారు. పార్టీని, తనను నమ్ముకున్న వారికి, గతంలో తాను హామీ ఇచ్చిన వారికి పట్టం కట్టి విశ్వసనీయత పెంచుకున్నారు. అదేవిధంగా కొత్తగా పార్టీలో వచ్చేవారికి సముచిత గౌరవం ఉంటుందన్న సంకేతాలు పంపించారు. స్థానిక సంస్ధల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబునాయుడు చేసిన కసరత్తుపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి తప్ప, మిగిలిన అందరి అభ్యర్థిత్వాలపై పార్టీలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈసారి బాబు పార్టీని, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేశారన్న వ్యాఖ్యలు ఆయన వ్యవహారశైలిని తప్పుపట్టేవారి నుంచి సైతం వినిపించాయి. నమ్ముకున్న వారికి న్యాయం చేయరని, కష్టాల్లో తన వెంట ఉన్న వారిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తారన్న అపప్రథ ఎదుర్కొంటున్న బాబు ఈ ఎంపికతో వాటిని అధిగమించి, శ్రేణుల్లో తనపై తాను నమ్మకం పెంచుకున్నారు. విశ్వసనీయత లేదంటూ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న బాబు, ఈ ఎంపికతో విశ్వసనీయత ఉన్న నాయకుడినన్న సంకేతాలు పంపించారు.
తన వెంట పాదయాత్రలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నేత మంతెన సత్యనారాయణరాజుకు ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పటివరకూ అన్యాయం జరుగుతూ వస్తోన్న రాజుకు ఈసారి న్యాయం జరగడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆ రకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావితం చూపే క్షత్రియులకు చేరువయ్యారు. ఇక అదేజిల్లాకు చెందిన అంగర రామ్మోహన్‌ను కొనసాగించి గౌడ కులస్థుల్లో నమ్మకం పెంచుకున్నారు. కర్నూలులో మాట ఇచ్చిన ప్రకారం శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎప్పటినుంచో పనిచేస్తున్న చిత్తూరు జిల్లా నేత దొరబాబుకు అవకాశం ఇచ్చి తన సొంత వర్గాన్నీ మెప్పించారు. గత ఉప ఎన్నికలో పోటీ చేసిన అనంతపురం నేత దీపక్‌రెడ్డికి ఈసారి స్థానం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అయితే, ఈ జిల్లాలో బలంగా ఉన్న బలిజలకు స్థానం కల్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఒకే కుటుంబానికి మూడు పదవులిచ్చారన్న విమర్శ మొదలయింది. పార్టీకి పాతకాపు, కష్టాల్లో కూడా తన వెంట ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాపునేత, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకూ న్యాయం చేసి అటు కాపుల్లోనూ సంతృప్తి మిగిల్చారు. ఈ విషయంలో ఆయన ఆర్థిక మంత్రి యనమల, హోంమంత్రి చినరాజప్ప సిఫార్సులను కూడా పట్టించుకున్నట్లు లేదు. వారిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన బొడ్డు భాస్కరరామారావుకు మద్దతునిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, శ్రీకాకుళంలో శత్రుచర్లకు సీటు ఇవ్వడంపై ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. అటు నెల్లూరులో బ్యాంకుల్లో వివిధ ఆర్థిక ఆరోపణలున్న వాకాటికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. అనంతపురంలో రెడ్డి సామాజికవర్గానికి కాకుండా బలిజ వర్గానికి ఇచ్చి ఉంటే పార్టీకి బలమైన వర్గం మరింత చేరువయ్యేదని నేతలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో ఓడిన వారు, వచ్చే ఎన్నికల్లో చాన్స్ లభించే అవకాశం లేని వారితోపాటు, వైసీపీ-కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి తానిచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీ పదవులివ్వడం ద్వారా తనకూ విశ్వసనీయత ఉందని బాబు నిరూపించుకోవడంతోపాటు, ఇప్పటివరకూ కొనసాగుతున్న ఆ విమర్శకు తన నిర్ణయాలతో తెరదించగలిగారు.
అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు సముచిత స్థానం లభిస్తుందన్న సంకేతాలు పంపగలిగారు. వాకాటి ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఆక్కడున్న ఆదాల, ఆనం సోదరులను కూడా కాదని టికెట్ ఇచ్చారు. సీటుపై ఆశలు పెట్టుకున్న ఆనం, ఆదాలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడటంతోపాటు, ఇన్చార్జి మంత్రి శిద్దారాఘవరావు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌ను వారి ఇళ్లకు పంపించి మరీ అసంతృప్తి లేకుండా చూశారు. అయితే, శ్రీకాకుళంలో మాత్రం ఇంకా అసంతృప్తి తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. ఆయన ఎంపిక వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని పార్టీ నేతలు వాదిస్తుండగా, పార్టీని నమ్ముకున్నందుకు బాబు ఆయనకు సీటు ఇచ్చారు.