ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ఏలేరు కెనాల్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 28: విశాఖ నగర పారిశ్రామిక అవసరాలతో పాటు, ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఏలేరు కెనాల్ నెల రోజుల పాటు మూసివేయనున్నారు. కెనాల్‌ను మార్చి 1 నుంచి 31 వరకూ మూసివేసి సాధారణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం పనులను మూడు రీచ్‌లుగా విభజించి, ఒక్కో రీచ్‌కు డిఇఇ, ఇద్దరు ఎఇలను నియమించారు. మొత్తం ముగ్గురు డిఇఇలు, ఆరుగురు ఎఇలు నెల రోజుల పాటు ఏలేరు కాలువ పనుల్లో నిమగ్నం కానున్నారు. ఆరేళ్ల తరువాత తిరిగి ఏలేరు కెనాల్ నిర్వహణకు సిద్ధం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధ పడుతున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణ సమయంలో కర్మాగారానికి అవసరమైన నీటి అవసరాల నిమిత్తం ఏలేరు కెనాల్‌ను నిర్మించారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీటితో పాటు పారిశ్రామిక, తాగు అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఏలేరు కెనాల్‌ను రోజుకు 700 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించగా, ప్రస్తుతం కాలువ ద్వారా కేవలం 300 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ప్రస్తుతం ఏలేరు కెనాల్ విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కార్పొరేషన్ (విస్కో) నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఏలేరు ద్వారా నగరానికి రోజుకు 60 ఎంజిడిల నీరు సరఫరా అవుతుండగా, దీనిలో అగ్రభాగం అంటే 35 ఎంజిడిల నీటిని స్టీల్‌ప్లాంట్‌కు, 8 ఎంజిడిలు ఎన్‌టిపిసి, 2 ఎంజిడిలు ఎపిఐఐసికి పంపిణీ చేయగా, మిగిలిన నీటిని నగర మంచినీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే ఏలేరు కెనాల్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటి సరఫరా జరగట్లేదన్న విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు. నిర్వహణ లోపంతో కెనాల్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కెనాల్ గట్లు ఎక్కడికక్కడ గండిపడిపోగా, కొన్ని చోట్ల లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. పూర్తి సామర్థ్యం నీటి సరఫరా 40 శాతానికి పడిపోయింది. దీంతో కెనాల్ నిర్వహణపై యంత్రాంగం దృష్టి సారించింది. తాజాగా కెనాల్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే రూ.30 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనావేశారు. ఇంత మొత్తంలో వెచ్చించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. తొలుత నీటి వృధాను అరికట్టడంతో పాటు కీలక రీచ్‌ల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు ప్రతిపాదించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీటిని ఏలేరు కెనాల్‌కు తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. అయితే ఇదే తరుణంలో ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని తరలించేందుకు కెనాల్ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల ద్వారా కెనాల్ నుంచి 15 శాతం నీటిని అదనంగా తీసుకురాగలమని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏలేరు కెనాల్ నీటిపైనే పూర్తిగా ఆధారపడింది. రోజుకు 35 ఎంజిడిల నీటిని ఏలేరు కెనాల్ ద్వారా సరఫరా చేస్తున్నారు. నీటిని స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కెబిఆర్)లో నిల్వ చేసుకుని వినియోగించుకుంటారు. ప్రస్తుతం కెబిఆర్‌లో 50 రోజులకు సరిపడగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కెనాల్ నిర్వహణ కాస్త ఆలస్యమైనప్పటికీ నీటికి ఢోకా ఉండదని అధికారులు వివరిస్తున్నారు.