ఆంధ్రప్రదేశ్‌

శత్రుచర్లకు బొత్స చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మంగళవారం ఇక్కడి కలెక్టరేట్‌లో టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేసారు. ఆయనతోపాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషా ఉన్నారు. నామినేషన్ ఘట్టానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో సమయం పూర్తయ్యేసరికి మరో ఇద్దరు ఇండిపెండెంట్లుగా మామిడి శ్రీకాంత్, కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు తమరాల శోభనబాబు నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో ఏకగ్రీవంగా శత్రుచర్ల ఎమ్మెల్సీగా ప్రకటించేలా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలంతా కృషి చేసినప్పటికీ, పొరుగు జిల్లా మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ ‘కాపు’కాసి అత్యవసరంగా శత్రుచర్లపై పోటీగా కాపు సామాజికవర్గానికి చెందిన, బొత్స బంధువు మామిడి శ్రీకాంత్‌తో నామినేషన్ దాఖలు చేయించినట్టు సమాచారం. అంతకుముందు రెబల్ అభ్యర్థిగా కోళ్ళ అప్పలనాయుడుతో కాపు సామాజికవర్గానికి అన్యాయం జరిగిందంటూ బొత్స ఉసిగొలిపి నామినేషన్ దాఖలు చేసేలా పావులు కదిపినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగి, ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శీరిషాలను పంపుతూ తన వాగ్దానంగా కోళ్ళకు డిసిసి చైర్మన్‌గా కాపు సామాజికవర్గం తరుఫున కోళ్ళ అప్పలనాయుడుకే ఇస్తామంటూ భరోసా ఇచ్చి, రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కాకుండా చేసారు. కేవలం ఏకగ్రీవం అయ్యేలా టిడీపీ వేసిన అడుగులు...బొత్స అడ్డుకోవడంతో తప్పనిసరిగా పోటీ ఏర్పడింది. దీంతో శత్రుచర్ల అనుచరులు ఆశించినట్టుగా ఏకగ్రీవం జరగలేదు. ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి మామిడి శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేయడం వెనుక బొత్స తన జిల్లాలో శత్రుచర్లకు గల మూడు అసెంబ్లీ సిగ్మెంట్‌లైన కురపాం, పార్వతీపురం, నాగూర్‌లో టిడిపి బలం మరింత పెరగకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడలో భాగమేనంటూ బొత్స వర్గీయులు చెబుతున్నారు. ఇదిలావుండగా, టిటిపి కంచుకోట సిక్కోల్‌లో ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు శోభనబాబు అందరికంటే ముందుగా తన నామినేషన్ దాఖలు చేసారు. టిడిపికి విధేయుడైనప్పటికీ, సిఎం ప్రకటించిన అభ్యర్థిపై మరో టిడిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం వెనుక బాబాయ్-అబ్బాయ్‌ల రాజకీయ మంత్రాంగం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. శత్రుచర్ల ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవడానికి ఇదోరకమైన ఎత్తుగడని, అందుకు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహకారం, వౌనం వెనుక అయిష్టంగా ఉన్న జిల్లా నేతలకు కొంత ఊరట ఇచ్చేలా ఉంటోందన్న భావనతోనే ఏకగ్రీవానికి మోకాలడ్డే ప్రయత్నం టిడిపి నేతలే చేసారంటూ విమర్శలు కూడా శత్రుచర్ల అనుచరులు నోట వినిపించాయి. ఏదిఏమైనప్పటికీ మూడు నామినేషన్లు దాఖలు కావడంతో సిఎం ఆలోచనలతో దరఖాస్తు లేకుండానే ఎమ్మెల్సీగా పార్టీ బి.్ఫరం అందుకున్న శత్రుచర్ల విజయానికి జిల్లా నేతలంతా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఎమ్మెల్యేలందరినీ పరుగులుపెట్టించింది.