ఆంధ్రప్రదేశ్‌

సమాచార పౌర సంబంధాల శాఖ అడిషినల్ డైరెక్టర్‌గా మల్లాది కృష్ణానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ మల్లాది కృష్ణానంద్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి కమిషనర్ పిఆర్ వెంకటేశ్వర్ అభినందిస్తూ నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల క్రితం గుంటూరులో డివిజనల్ పిఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టిన కృష్ణానంద్ సమాచార శాఖలో సమర్ధవంతంగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత ఎన్టీఆర్, నారా చంద్రబాబులు వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోను పర్యాటక శాఖలోను, ఏపి ప్రెస్ అకాడమీలో కూడా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో కొంతకాలం ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. కృష్ణానంద్ సుప్రసిద్ధ రచయిత కూడా. తెలుగు పెద్దలు పేరిట 250 మంది ప్రముఖుల జీవిత విశేషాలు రచించారు.