ఆంధ్రప్రదేశ్‌

గిట్టుబాటు కాని ‘ఉపాధి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 2: అనంతపురం జిల్లాలో ‘ఉపాధి’ పనుల కల్పనలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓవైపు పనులు కల్పించడం లేదని గ్రామీణులు ఆరోపిస్తుంటే...మరోవైపు ఉపాధి పనులు కల్పించినా జనం రావడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో పంట కుంటలు (్ఫరంపాండ్స్) తవ్వకానికే అనుమతి ఉందని, ఇతర పనులు చేపట్టలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఆ పనుల వైపే వారు మొగ్గు చూపుతున్నారు. తమపై ప్రభుత్వ ఒత్తిడి ఉందంటూ, జూన్ నాటికి లక్ష ఫారం పాండ్లు పూర్తి చేయాలన్నదే తమ ధ్యేయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాలు కురిస్తే పంటకుంటల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్న మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం చేయగలిగిన పనులు కూడా తమకు లేకపోతే ఎలా అంటూ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వర్షాభావంతో దశాబ్దాల తరబడి నేల ఎండిపోతూ గట్టి పడటంతో గునపం దిగడం లేదు. దీంతో ఉపాధి పనుల్లో కూలీలు చేతులకు బొబ్బలెక్కి అల్లాడుతున్నారు. దీనికి తోడు కూలి రూ.150 కూడా గిట్టుబాటు కావడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యూబిక్ మీటర్(మూడు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవు, మూడు అడుగుల లోతు) పనికి రూ.218 అందజేస్తున్నామని అధికారులు అంటున్నారు. తొలుత రూ.215 ఉండేదని, వేసవి దృష్ట్యా మరో రూ.3 పెంచామంటున్నారు. అయితే ఈ కూలీ సరిపోదని మరింత పెంచాలని కూలీలు అంటున్నారు. దీనికి నిబంధనలు అంగీకరించవని అధికారులు అంటున్నారు.
మరోవైపు జిల్లాలో పనులు సరిగా కల్పించడం లేదు. దీనికి తోడు పనులు చేపట్టిన ప్రదేశాల్లో అత్యవసర సౌకర్యాలు లేవు. ఎండలు మండిపోతున్నా.. చాలాచోట్ల పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం, నీడ, ప్రథమ చికిత్స కిట్స్ అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు ఫారంపాండ్స్ బదులు సులభమైన ఇతరత్రా పనులు కల్పించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. వర్షాభావంతో పంటలు నిలువునా ఎండిపోవడం, బోర్లు, బావుల్లో భూగర్భజలాలు పడిపోయి వృథాగా పడి ఉండటం, వేసవి రాకనే తాగునీటి ఎద్దడి మొదలవడం, పశుగ్రాసం కొరత, ఉపాధి మృగ్యం కావడం, వలస పోవడం వంటి దృశ్యాలు నిత్య కృత్యాలు. దశాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఈ క్రమంలో ఏటా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నా, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అనంత కరవునివారణలో ఏమాత్రం మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా.. సమస్యలు ఏటేటా జఠిలమవుతూనే ఉంది. నేపథ్యంలో పనుల్లేక జనం వలస పోగా, గ్రామాల్లో మిగిలిన మహిళలు, పురుషులకు ఉపాధి పనుల కల్పన నామమాత్రంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పనుల్లేక అవస్థలు..
జిల్లాలోని కదిరి, పుట్టపర్తి ప్రాంతాల్లో అత్యధికంగా పనుల్లేక అవస్థలు పడుతున్నారు. అలాగే ధర్మవరం, హిందూపురం, మడకశిర, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, అనంతపురం రూరల్, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో జాబ్‌కార్డులున్న వారిలో సగం మందికే పనులు కల్పించారు. గాండ్లపెంట మండలంలోని మల్లమీదపల్లి పంచాయతీలో మొత్తం 850 జాబ్‌కార్డులుండగా, అందులో 480 మంది మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి వందలాది గ్రామాల్లో నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 49,000 మంది శాశ్వత జాబ్‌కార్డుదారులున్నారు. ఉపాధి పనులు కూడా ఇదివరకు 100 రోజులు ఉండేవి. ప్రస్తుతం 150 పని దినాలకు పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేవలం పంట కుంటల తవ్వకానికే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు.

చిత్రం.. నల్లమాడ మండలంలో ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు