ఆంధ్రప్రదేశ్‌

రెండు బస్సులు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/దొరవారిసత్రం, మార్చి 2 : కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోరప్రమాద సంఘటన మరువకముందే ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో గురువారం ఉదయం రెండు ప్రైవేటు బస్సులు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ప్రకాశం జిల్లా పిసి పల్లివద్ద తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 47 మందికి తీవ్రగాయాలు కాగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కాగా ఒక ప్రైవేటు వైద్యశాలలో ఏల్చూరి శ్రీకాంత్ (9వ తరగతి) విద్యార్థికి తలకు తీవ్రమైన గాయం కావడంతో వైద్యులు శస్తచ్రికిత్స చేశారు. డ్రైవర్ ఎస్‌కె కాలేషా అతివేగంగా బస్సును నడపటంతోపాటు మద్యం సేవించి ఉండటం, ఒక మహిళను క్యాబిన్‌లో ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కరేడు జిల్లా పరిషత్ హైస్కూలుకు చెందిన విద్యార్థులు కర్నూలు జిల్లాలోని మహానంది, యాగంటి పుణ్యకేత్రాలకు ఎస్‌విఎల్‌సి బస్సులో బయలుదేరారు. ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి వస్తుండగా గురువారం వేకువజామున పిసిపల్లి మండలం పెదఅలవలపాడు వద్ద రెయిలింగ్‌ను ఢీకొని 20 అడుగుల బ్రిడ్జిపై నుంచి బోల్తా కొట్టింది. 40మందికి గాయాలు కాగా వారిలో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండల కేంద్రానికి సమీపంలో నెలబల్లి వద్ద రెండు బస్సులు ఢీకొని 30 మందికి గాయాలయ్యాయి. రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో 30 మంది గాయ పడ్డారు. శ్రీసిటీ సెజ్‌లో శ్రీవారి మొబైల్ కంపెనీకి వాకాడు మండలం నుండి నిత్యం మహిళా ఉద్యోగులను తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో నెలబల్లి వద్ద రోడ్డుపై గేదె అడ్డుగా రావడంతో షడన్ బ్రేక్‌వేశారు. వెనకే వేగంగా వస్తున్న శ్రీవెంకటరమణ ట్రావెల్స్ ఉద్యోగినులు ప్రయాణిస్తున్న కంపెనీ బస్సును వెనుకనుంచి బలంగా ఢీకొట్టడంతో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మహిళా ఉద్యోగులకు గాయాలయ్యాయ.

చిత్రాలు..కరేడు వద్ద కల్వర్టు ఢీకొని బోల్తాపడిన బస్సు * దొరవారి సత్రం నెలబల్లివద్ద పల్టీ కొట్టిన బస్సు