ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, మార్చి 2: పంచభూతాల సమతుల్యం దెబ్బతినడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ప్రళయాలు సంభవిస్తున్నాయని, ఇవి రాకుండా ఉండాలంటే ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ భక్తులకు ఉద్బోధించారు. విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని విశ్వనగర్ ఆవరణలో విశ్వకుండలిని శ్రీనివాస సుబ్రహ్మణ్యస్వామికి 108 కలశాలతో సర్పసూక్తసహిత అభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలను విశ్వంజీ మహరాజ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ పంచభూతాలను పరిరక్షించుకోవడం ద్వారా పృథ్వీమాతను పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తున్నామో దాని పర్యావసానంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని విశ్వంజీ గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మానవులు తమ మేధస్సును వినాశనానికి వినియోగించి పంచభూతాల సమతుల్యతను దెబ్బతీస్తున్నారని, అందువల్లే ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం (అంతరిక్షం) కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు. తొలుత యజ్ఞశాలలో ఏకాదశ రుద్ర పారాయణలు, విశిష్ట అభిషేకాలు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వమానవ సమైక్యతాసంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులు, రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్ సిఆర్‌కె ప్రసాద్, దత్తాత్రేయశాస్ర్తీ, దయానంద్, విశ్వకుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..శ్రీనివాస సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తున్న విశ్వంజీ