ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఏ ప్యాకేజీ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి, ఉండవల్లి గ్రామ పంచాయితీకి చెందిన 26 మంది దళితుల భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి సిఆర్‌డిఏ అసైన్డ్ ప్యాకేజీ ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కమలమ్మ శుక్రవారం తన ముందు హాజరైన కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర రెవెన్యూ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1977 సంవత్సరంలో ఉండవల్లి పంచాయితీ పరిధిలో కృష్ణానది పరివాహక పరిధిలోని లంక అసైన్డ్ చేసిన 39.11 ఎకరాల భూమిని పేద దళితులకు జీవనోపాధి కోసం కేటాయించింది. అయితే 1992లో కొందరు ఉన్నత వర్గాలకు చెందిన వారు దళితులకు కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు. దళితులు తమకు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ముందు హాజరు కావాలన్న కమీషన్ ఆదేశం మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర రెవెన్యూ అధికారులు ఈరోజు ఢిల్లీకి వచ్చారు. దళిత రైతుల తరపున న్యాయవాది బి.వెంకటేశ్వరరావు, మనె్నం మోహన్‌రావుతదితరులు ఎస్సీ కమీషన్ ముందు వాదించారు.