ఆంధ్రప్రదేశ్‌

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: మంత్రి దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2009లోనే వేర్వేరుగా టెండర్లు పిలవగా స్పిల్‌వే పనులు, రాక్‌వీల్ డ్యాం పనులు చురుగ్గా సాగుతుండగా 900 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్టును సొంతం చేసుకోవాలనే దురాలోచనతో దుర్మార్గంగా వైఎస్ హయాంలో టెండర్లను రద్దు చేశారన్నారు. తిరిగి 2013లో కొత్తగా టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లారని మంత్రి ఆరోపించారు. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించారేగాని ముంపు మండలాల గురించి పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఆర్డినెన్స్ తెప్పించి ఆ మండలాలను రాష్ట్రంలో విలీనం చేస్తూ బిల్లును ఆమోదింప చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్వాసితులకు రూ.లక్షా 70వేలు కేటాయిస్తూ దళారులు సగానికి పైగా దిగమింగారని, తమ ప్రభుత్వ హయాంలో ఐదు నుంచి ఏడు లక్షల వరకు చెల్లించడమేగాక వారికి పునరావాసం కల్పిస్తున్నామని చెప్పారు. కీలకమైన డ్యాం నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం లక్ష క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరుగుతోందని, దీన్ని రెట్టింపు చేయడానికి రామయ్యపేట, పైడిపాక గ్రామాల ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తుంటే జగన్ తమ దూతలను పంపించి రెచ్చగొట్టి వారిని వెళ్లనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఓడిన మడకశిర నియోజకవర్గంతో పాటు తొలిసారిగా పులివెందులకు కూడా సాగునీరు ఇస్తున్నామన్నారు.