ఆంధ్రప్రదేశ్‌

‘వకుళమాత’ చిత్రాన్ని ఆవిష్కరించిన పరిపూర్ణానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 3: శ్రీనివాసుని మాతృమూర్తియైన శ్రీ వకుళమాత చిత్రాన్ని శుక్రవారం తిరుపతిలోని త్యాగరాజమండపంలో శుక్రవారం శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో టిటిడి పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ముందుగా పరిపూర్ణానంద స్వామి అమ్మవారి చిత్రానికి పూజలు చేయగా, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ వకుళమాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదని అన్నారు. అయితే పురాణాలు,వేదాల్లో ఉన్న ఆమె వర్ణన ఆధారంగా వైఖానస ఆగమోక్తంగా, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతునికే అన్నంపెట్టి, సేదతీర్చి, వివాహం జరిపించిన మాతృమూర్తిత్వం ఉట్టిపడేలా శ్రీ వకుళమాత చిత్రాన్ని రూపొందించామన్నారు. పరిపూర్ణమైన మాతృత్వం ఉట్టిపడేలా అమ్మవారి ముఖారవిందంతో, కుడిచేయితో అభయ ప్రదానం చేస్తూ, ఎడమ చేతితో బిడ్డకు అన్నం తినిపించడానికి పట్టుకున్న అన్నం గినె్నతో వకుళమాతను చిత్రకారుడు చెన్నుపల్లి శ్రీనివాసరావు అద్భుతంగా చిత్రీకరించారన్నారు. రెండుసార్లు చిన్నచిన్న మార్పులు చేసి మూడోసారి వేదపండితులు, ఆగమశాస్త్ర పండితులు ఆమోదం మేరకు ఈచిత్రాన్ని ఆమోదించామని అన్నారు. త్వరలోనే టిటిడికి ఈచిత్రాన్ని అప్పగించి అమ్మవారి విగ్రహాన్ని రూపొందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 7.50 గంటలకు కుంభలగ్నం, రోహిణి నక్షత్రంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ఇక్కడ వెండి ఊయల ఏర్పాటు చేసి చిన్న బిడ్డలకు నామకరణం, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
శ్రీవేంకటేశ్వరుని మాతృమూర్తియైన వకుళమాత ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావడంకోసం శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి వెంట నడవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం వకుళమాత చిత్రం ఆవిష్కరణ సభలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. వకుళపురం భవిష్యత్తులో మహిమాన్విత క్షేత్రంగా భాసితుల్లుతుందని అన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం చారిత్రాత్మక ఘట్టానికి తెరతీస్తున్నట్లు చెప్పారు.