ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పెరిగిన ఉషోణ్రగతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 3: వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భానుడు సీజన్ ఆరంభంలోనే ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చి తొలి వారం నుంచి నెమ్మదిగా పెరుగుతూ ఏప్రిల్, మే మాసాల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంగా మారే పరిస్థితులుంటాయి. అటువంటిది మార్చి ఒకటవ తేదీ నుంచే ఎండల తీవ్రతతో జనం భయపడుతున్నారు. అదీ ఎపుడూ చల్లని వాతావరణం ఉండే విశాఖలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలో కోస్తాంధ్రాకు సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రంలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలనుబట్టి ఎండల తీవ్రత ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నందిగామలో 38 డిగ్రీలకు చేరింది. రెంటచింతలలో 36, తునిలో 36, కళింగపట్నంలో 34, బాపట్లలో 32, మచిలీపట్నంలో 33, గన్నవరంలో 36, ఒంగోలులో 34, నర్సాపురంలో 31, కావలిలో 33 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిగామ, విశాఖపట్నం, గన్నవరం ప్రాంతాల్లోనే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగాయి. ఈ విధంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలకు మించి ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. వాతావరణంలో పొడిగాలులు వీస్తున్నందున కాస్తంత మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు నెలాఖరు నుంచి క్రమేపీ పెరుగుతూ ఏప్రిల్, మేల్లో వీటి తీవ్రంగా మరింతగా ఉండవచ్చని కేంద్రం వివరించింది. మార్చి తొలిరోజుల్లోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రతిరోజు 48నుంచి 50 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడకం ఉంటుండగా, గత రెండు రోజులుగా ఇది కాస్త పెరిగి 55 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. దీంతో సంస్థ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి నుంచే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరాను ఏ విధంగా చేయాలనే అయోమయంలో సంస్థ వర్గాలు పడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడైన విశాఖ జిల్లాలో ప్రతిరోజు 18 నుంచి 20 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడకం జరిగేది. గత నాలుగు రోజులుగా చూస్తే ఈ వాడకం 24 ఎంయుకు చేరుకుంది.రెండు రోజుల్లో ఇది కూడా 26 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న పరిశ్రమలు, వాణిజ్య, గృహ అవసరాల వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటం, ఏసిలు వాడకం ఊహించని విధంగా పెరుగుతున్న పరిస్థితులు విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది.