ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల కోర్కెల సాధనకై 27 నుంచి రాష్టవ్య్రాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఏప్రిల్ 16: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల న్యాయమైన కోర్కెలు, హక్కుల సాధనకు ఈనెల 27 నుంచి విధులు బహష్కరించి ఉద్యమబాట పట్టనున్నట్లు నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం కన్వీనర్ అయిలూరి శ్రీనివాస దీక్షితులు తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ.10 వేలు కనీస వేతనం అమలుచేయాలన్నారు. పిఆర్‌సి ప్రకారం జీతాలు పెంచాలని కోరుతున్నామన్నారు. 6-బి, 6-సి ప్రకారం వేతనాలు అమలు చేయకుండా దేవస్థానాల ఈవోలు, మేనేజర్లు వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. దేవస్థానాలకు చెందిన ఆస్తులు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి తెలియజేయకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.