ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ భూమి తనఖాతో రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఆంధ్ర విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, ప్రత్యూష రిసోర్సస్ ఇన్‌ఫ్రా , ఇండియన్ బ్యాంక్ అధికారులు ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి రూ.114 కోట్ల రుణం పొం దారని అభియోగం మోపుతూ, వీరిపై చర్యలు తీసుకోవాలని విశాఖ గాజువాకకుచెందిన అజయ్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేముల వలస గ్రామంలో ఈ చర్యకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు డాక్యుమెంట్ల వివరాలను కోర్టుకు అందచేశారు. ప్రస్తుతం ఈ మొత్తం సొమ్ము వడ్డీతో కలిపి రూ.196 కోట్లకు చేరిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, నగర పోలీ సు కమిషనర్‌కు నివేదించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు.