ఆంధ్రప్రదేశ్‌

23న దేవాదాయ శాఖ ఇఓల వౌన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 4: దీర్ఘకాల సమస్యల సాధన కోసం దేవాదాయశాఖ ఇఓలు పోరుబాట పట్టనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ గొల్లపూడిలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఈనెల 23వ తేదీన వౌన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరగనుంది. శనివారం ఉదయం విజయవాడ పాతబస్తీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఇఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి విశ్వనాథ రాజు మాట్లాడుతూ రెవిన్యూ శాఖ నుండి ఉద్యోగులను దేవాదాయ ధర్మాదాయ శాఖకు బదిలీ చేయరాదని, ఇవోల గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎసి, డిసి పోస్టులను అన్ని అర్హతలు ఉన్న దేవాదాయ సిబ్బందికి కేటాయించాలన్నారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో చివరకు ఈ వౌన పోరాటం చేయాలని శనివారం జరిగిన రాష్టక్రమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇవోల రాష్ట్ర అధ్యక్షుడు వినోద్‌కుమార్, కార్యదర్శి సి దారాబాబు, నేతలు వి ధనదుర్గా ప్రసాద్, కెవియన్‌డికె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.