ఆంధ్రప్రదేశ్‌

సంస్కరణలకు చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 4: పెద్దనోట్ల రద్దు, బినామీ ఆస్తుల చట్టం, ఇక్కడితో మోదీ సంస్కరణలు ఆగిపోవని, భవిష్యత్‌లో మరిన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ప్రకటించనుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పివిఎన్ మాధవ్ తరపున విశాఖలో శనివారం జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు తొలగించి, దేశాన్ని ముందుకు నడిపించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగతమనంగా పయనిస్తోందని, అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా సైతం వృద్ధిరేటు సాధనలో వెనుకబడిందన్నారు. అయితే ఇంతటి మాంద్యాన్ని తట్టుకుని భారత్ వృద్ధిరేటు సాధనలో ముందుకు సాగుతోందని, అది ప్రధాని మోదీ తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో మంత్రిగా తాను చెప్పుకుంటున్న గొప్పలు కావని, ప్రపంచ ఆర్థిక విశే్లషకులు, సవివరంగా చెప్పిన విషయాలన్నారు. నోట్ల రద్దు అనంతరం ఎదురైన తాత్కాలిక కుదుపును తట్టుకుని భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నది విశే్లకుల అంచనాగా పేర్కొన్నారు. వివాదాలు సృష్టిస్తూ, విపక్షాలను విమర్శించడమే ఎన్‌డిఎ ప్రభుత్వ లక్ష్యం కాదని, తమపై విమర్శలు వచ్చినప్పటికీ లక్ష్యపెట్టకుండా మోదీ ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు. గత కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో చౌకబారు విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు ఫలితాలే సమాధానం చెపుతాయన్నారు. హత్యా రాజకీయాలపై కమ్యూనిస్టులు చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం కేరళలో ఇప్పటి వరకూ వందలాది మంది బిజెపి వర్గాలను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న విపక్షాలకు గుణపాఠం చెప్పే విధంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది రుజువైందన్నారు. విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి మంజూరయ్యే ప్రతి పథకం ముందుగా ఎపి, తెలంగాణలకు దక్కుతాయని, కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన కర్తవ్యంగా భావిస్తానని అన్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమించే నాయకులని, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడం ద్వారా తమకు మద్దతు ప్రకటించాలని పట్ట్భద్రులకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు