ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసి బస్సుల్లో మంచినీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 4: ప్రస్తుత వేసవి కాలంలో రాష్ట్రంలోని 9వేల ఆర్‌టిసి బస్సులన్నింటినీ పరిశుభ్రం చేసేందుకు డిపోలవారీగా చర్యలు చేపట్టబోతున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య తెలిపారు. ఆంధ్రభూమి పత్రిక ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా అన్ని డిపోల్లోనూ తరచుగా బస్సులకు వాటర్ సర్వీసింగ్ జరుగుతున్నప్పటికీ అనేక బస్సులకు స్వల్ప మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. ప్రధానంగా సీట్లన్నింటినీ శుభ్రపచరడం.. నిలబడిన లేదా కూర్చున్న ప్రయాణికులు పట్టుకునే ఇనుపరాడ్లకు తుప్పు ఏమైనా ఉంటే వదిలించడం, చినిగిన సీట్ల రిపేర్లు వంటివి చేపట్టి బస్సులన్నీ దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడతామన్నారు. వడగాలులు వీచే సమయంలో బస్సు లోపల స్తంభించే వేడి గాలులకు ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవకుండా పైభాగంలో రెండుచోట్ల లోపలి గాలి వెలుపలకు వెళ్లేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎగ్జాస్టర్ ఫ్యాన్లు బిగిస్తామన్నారు. ఇక బస్‌స్టేషన్‌లో ప్రయాణికులకు వడగాలుల తీవ్రత తగులకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని బస్ స్టేషన్లలో కూలింగ్ వాటర్ సరఫరా జరుగుతున్నదని గ్రామీణ బస్సుల్లో కూడా మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నారు. మొత్తంపై వేసవిలో ప్రయాణికులెవరూ ఇబ్బంది పడకుండా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు చేపడతామన్నారు.
కృష్ణాజిల్లా బస్సుల్లో స్టిక్కర్లు
నందిగామ సమీపంలోనూ, ప్రకాశం జిల్లా కందుకూరులోనూ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఘోర ప్రమాదానికి గురైన వెంటనే తమ అధికారులు, సిబ్బంది, కార్మికులను మరోసారి అప్రమత్తం చేశామని ఓ ప్రశ్నకు సమాధానంగా మాలకొండయ్య చెప్పారు. ఒక్క ఆర్‌టిసి బస్సుల్లోనే డ్రైవర్లకు అవసరమైన విశ్రాంతి లభిస్తున్నదన్నారు. తాజాగా ప్రతి బస్సులోనూ డ్రైవర్లను అప్రమత్తం చేసే స్టిక్కర్లను అంటిస్తున్నామని అలాగే వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బస్‌స్టేషన్‌లలో పోస్టర్లు అంటిస్తామన్నారు. ఇక స్టిక్కర్లలో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరచారు. సెల్‌ఫోన్‌లోనూ, తోటి ప్రయాణికులతో మాట్లాడకుండా డ్రైవింగ్ వైపే దృష్టిని కేంద్రీకరించాలి. ముందు వెళ్లే వాహనాలకు బస్సుకు మధ్య కనీస దూరం పాటించాలి. ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవర్, ప్రయాణీకులు క్షేమంగా గమ్యంకు చేరాలి. ప్రయాణికుల సురక్షిత రవాణా, మీ ఆర్‌టిసి బాధ్యత అని ఆ స్టిక్కర్లలో పేర్కొన్నారు.