ఆంధ్రప్రదేశ్‌

జెసి బ్రదర్స్ భాష దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 5: జెసి బ్రదర్స్ వాడుతున్న భాష అన్నం తినేవారిలా లేదని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎపుడూ, ఎవరూ వాడని భయంకరమైన, అసభ్యకరమైన భాషను జెసి బ్రదర్స్ తమ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఉపయోగించడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారెవరికైనా ఆఖరికి టిడిపి వారికి కూడా బాధ కలిగించకమానదన్నారు. వారి భాషను సమర్ధిస్తున్న చంద్రబాబునాయుడు ఏమి తింటున్నారో అనే సందేహం కలుగుతోందన్నారు. రాజమహేంద్రవరంలోని వైసిపి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. చంద్రబాబునాయుడుపై ఇదే భాష ఉపయోగించి ఉంటే ఈపాటికి ఎన్నో కేసులు పెట్టించి ఉండేవారన్నారు. చంద్రబాబునాయుడు ఇలాంటి రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. సంస్కారాన్ని మర్చిపోయి కారుకూతలు కూస్తున్న ఒక శాసనసభ్యుడిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. జెసి బ్రదర్స్ దౌర్భాగ్యకరమైన భాషపై చర్యలు తీసుకోలేదంటే చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్టేనన్నారు. ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారంటే ఇంతకంటే కక్ష సాధిం మరోటి ఉండదని అంబటి పేర్కొన్నారు. ఒక మహిళా శాసనసభ్యురాలిపై ఇంత కక్ష సాధిస్తే ప్రజాతీర్పునకు చంద్రబాబునాయుడు కూడా అతీతులు కారని మర్చిపోకూడదన్నారు. ఇప్పటికే 22 మందిని లాగేసుకుని, మరో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చూస్తున్నారంటే చంద్రబాబునాయుడును ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. శాసనసభలో తమ గొంతు వినిపించేందుకు ఒక్కరున్నా చాలని, ఎన్నో వేదికలు ఉన్నాయని, తమ గొంతు విన్పించి చివరి వరకు పోరాడతామన్నారు. దుష్ట రాజకీయాలకు చరమ గీతం పాడుతామని, బాబుకు ఇక రెండేళ్ల సమయమే ఉందన్నారు. చంద్రబాబునాయుడు తన కొడుకు కోసం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. క్రూర రాజకీయాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని, పోలీసులు, కేసులతో ఎంత కాలం నొక్కుతారని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు వైసిపి కంకణం కట్టుకుందన్నారు. కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలు బయటకు రావాలంటే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో గ్రేటర్ రాజమహేంద్రవరం వైసిపి అధ్యక్షుడు కందుల దుర్గేష్, వైసిపి రాజమహేంద్రవరం అర్బన్ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసిపి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, గుత్తుల మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు