ఆంధ్రప్రదేశ్‌

అమరావతి నిర్మాణంలో ముందడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 5: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా జరగనున్న శాసనసభ సమావేశాలు రాష్ట్ర అభ్యుదయానికి వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. శాసనసభలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ - రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమానికి దోహదపడాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొలి శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలే పరమావధిగా అర్థవంతమైన చర్చలు జరిగి చారిత్రాత్మకంగా నిలిచిపోవాలని ఆయన అన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వడివడిగా కీలక అడుగులు వేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధిలో ప్రజా సహకారం, భాగస్వామ్యంతో సమగ్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామన్నారు. రాష్ట్భ్రావృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖాధిపతులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతి నగరంలో ప్రభుత్వ కార్యాలయ సముదాయ డిజైన్లు తుది అంకానికి వచ్చాయని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల కలయికతో ప్రపంచంలో అద్భుతంగా ఉండేలా అమరావతి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఉంటుందన్నారు. సంప్రదాయంలో ఆధునికతను మేళవించాలని ప్రధాన డిజైన్ రూపకర్తలకు సూచించామన్నారు. రాష్ట్రం ఐటి హబ్‌గా మారనుందని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టెరి’ (ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- ఢిల్లీ) అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయాన్ని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, స్పెషల్ సీఎస్ టు సీఎం సతీష్‌చంద్ర, ఇంధన శాఖ, ఐ అండ్ ఐ సిఆర్‌డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ప్రస్తావించినప్పుడు ఇది పెరుగుతున్న మన రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ సహా రాయలసీమ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, అమరావతి కేంద్రంగా ఐటి రంగం అభివృద్ధి జరుగనుందన్నారు. ఇటీవల హెచ్‌సిఎల్ తమ కార్యకలాపాలను విజయవాడ నుంచి సాగించేందుకు ముందుకు రావడం రాష్ట్ర విద్యార్థులకు, యువతకు శుభ సూచకమని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం కూడా అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతోందన్నారు. ఫిన్‌టెక్స్ టవర్స్ నిర్మాణం తర్వాత విశాఖలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ఆయన తెలిపారు. వీసా, థామస్ రాయ్ టవర్స్ వంటి సంస్థలు విశాఖ ఫిన్‌టెక్స్ టవర్స్‌లో తమ కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అమరావతిలో ఎస్ బ్యాంక్ ఫిన్‌టెక్ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు, పర్యాటక రంగానికి సహకరించేందుకు ముందుకు రావడం, నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశమని చంద్రబాబు చెప్పారు.
సిఐఐ భాగస్వామ్య సదస్సు తరహాలో ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ ‘్ఫన్‌టెక్’ సదస్సును విశాఖలో నిర్వహించనున్నామని చంద్రబాబు తెలిపారు. వీటిలోనూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఐటి సెక్రటరీ కె విజయానంద్‌ను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్‌లో స్థాపించేందుకు ఆనాడు సంస్థ అధిపతి బిల్‌గేట్స్‌ను 45 నిమిషాల్లో ఒప్పించామని, ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆ సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. రాష్ట్రంలో ఈ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపనపై నిర్ణయం తీసుకునేలోగా మైక్రోసాఫ్ట్ సేవలను అందించడం ద్వారా ఈ-ప్రగతి, ఈ-పాలనలో సంపూర్ణ సహకారం ఇస్తామని సంస్థ సీఈవో సత్య నాదేళ్ల హామీ ఇవ్వడాన్ని అధికారులకు చంద్రబాబు గుర్తుచేశారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దక్కుతాయన్నారు.
భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేంతవరకూ రైతులు నీటి కోసం అవస్థలు పడకుండా ఉండేందుకు వీలుగా ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలకు నీరందించే చర్యలు వేగవంతం చేశామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి, కృష్ణానది అనుసంధానం చేయడంతోపాటు కృష్ణాడెల్టాకు సాగునీటిని అందించగలిగామని తెలిపారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కెసి కెనాల్ రైతులకు సాగునీటిని అందించామని గుర్తుచేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో 800 మెగావాట్లు అదనంగా కేటాయించి రైతుల పంపుసెట్లకు 24 గంటల పాటూ కరెంట్ సరఫరా చేసిన ఖ్యాతి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సముద్ర తీరప్రాంత పారిశ్రామిక ఆర్థికాభివృద్ధి మండలిలో భాగంగా వైజాగ్, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, బెంగుళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏబిబి ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఇటీవల కేంద్రం ఏడిబి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వైజాగ్ - చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు రూ. 2500 కోట్లు మంజూరు పత్రాలపై ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈ పథకంలో 50 శాతం వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం భూమిని పెట్టుబడిగా పెట్టనుందన్నారు. బెంగళూరు - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని, ఈ రెండు కారిడార్‌లు పూర్తయితే రాష్ట్రంలోని 974 కి.మీటర్ల మేర ఉన్న సముద్ర తీరప్రాంతమంతా పారిశ్రామికంగా వృద్ధి సాధిస్తుందని చంద్రబాబు వివరించారు. ఈసందర్భంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, విజయానంద్ మాట్లాడుతూ ఈ నెలాఖరులో వాషింగ్టన్‌లో జరిగే ప్రపంచ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో తొలిదశలో రూ.2500 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణాన్ని ఆమోదిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్ఠపర్చి 24 గంటలూ కరెంట్ సరఫరా శాశ్వతం చేయడానికి ఈ రుణం దోహదం చేయనున్నట్లు వారు వివరించారు.

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 5: వెలగపూడి తాత్కాలిక సచివాలయ ఆవరణలో తొలిసారిగా సొంతగెడ్డపై ఆసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 6 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భత్రను కట్టుదిట్టం చేశారు. కేటగిరీల వారీగా గేట్లను, ఎంట్రీ గేట్లను కేటాయించారు. అసెంబ్లీలోకి నిర్ణీత అనుమతిపత్రం ఉంటేనే అనుమతించనున్నారు. సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాట్ల గురించి ప్రత్యేక భత్యాన్ని అందచేశారు. దీంతో గృహాల కోసం ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు వెతుకులాట ప్రారంభించారు. తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ భవనం కాంతులీనుతోంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న సమావేశాలు కావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరుకానుండటంతో భద్రతా పరంగా, రవాణాలో ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
సమావేశాలకు వచ్చే దారుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, ఉండవల్లి స్కూృ బ్రిడ్జి, తాడికొండ అడ్డరోడ్డు, మంగళగిరి స్కూల్ వద్ద చెక్‌గేట్లను ఏర్పాటు చేశారు. ఐదు మంది ఎస్పీలు, 20 మంది డిఎస్పీలు, 41 మంది సిఐలు, 123 మంది ఎస్‌ఐలు, మరో 700 మంది పోలీసులను భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ఐదు గేట్లను, అసెంబ్లీలోకి వెళ్లేందుకు 9 గేట్లను ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడేందుకు మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేశారు. మొదటి గేటు ద్వారా ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, రెండవ గేటు ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మూడో గేటు ద్వారా మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులు, నాలుగో గేటు నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐదో గేటు నుంచి సీనియర్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందిని అనుమతించనున్నారు. అసెంబ్లీలో మొదటి ద్వారం ద్వారా సిఎం, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, గేటు-2 ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నేతలు, గేట్-3 ద్వారా ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు, కార్యాలయ అధికారులు, గేట్-4 ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గేట్-5 రాకపోకలకు, సీనియర్ ఐఎఎస్ అధికారులు, అసెంబ్లీ సిబ్బందికి కేటాయించినట్లు తెలిపారు. 6వ ద్వారం ద్వారా స్పీకర్, శాసన మండలి చైర్మన్, 7వ గేట్ ద్వారా పాస్‌లు ఉన్నవారు విఐపి గ్యాలరీలోకి అనుమతిస్తారు. 8వ గేటు ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, 9వ గేటు ద్వారా మీడియాకు ప్రవేశం కల్పించనున్నారు.