ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులుగా నారా లోకేష్, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌తోపాటు, వైసీపీ అభ్యర్ధులుగా ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి సోమవారం నామినేషన్లు వేశారు. వీరంతా శాసనసభ కార్యదర్శి సత్యనారాయణకు తమ నామినేషన్లు అందచేశారు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం నామినేషన్ సందర్భంగా ఆ జిల్లా మంత్రి శిద్దారాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులతోపాటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యేలు స్వామి, సాంబశివరావు, కదిరి బాబూరావు డేవిడ్‌రాజు హాజరయ్యారు. అయితే కరణం ప్రత్యర్థి వర్గమైన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, పోతుల రామారావు, అశోక్‌రెడ్డి కనిపించలేదు. ఫలితంగా ప్రకాశం జిల్లా మొత్తం కరణం వెంట ఉన్నట్లు స్పష్టమయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను అభినందించారు. టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ నామినేషన్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.