ఆంధ్రప్రదేశ్‌

జవాబుపత్రంతో ఇంటర్ విద్యార్థి పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 6: పరీక్ష అనంతరం జవాబుపత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా వెంట తీసుకువెళ్లాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఆలస్యంగా గమనించిన పరీక్ష నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. పరీక్ష సరిగా రాయలేకపోవడంతో భయంతోనే జవాబుపత్రం వెంట తీసుకువెళ్లినట్లు విద్యార్థి తులసీరాయుడు తెలిపారు. కడప నగరంలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానిక చెందిన తులసీరాయుడు నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గాయత్రి జూనియర్ కాలేజిలో ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం లెక్కల పేపర్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష సమయం అయిపోగానే ఇన్విజిలేటర్‌కు జవాబుపత్రం ఇవ్వకుండా పరారయ్యాడు.