ఆంధ్రప్రదేశ్‌

రైతులతో కలిసి బాబు భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, మార్చి 6: నూతన రాజధాని అమరావతిలో తొలిసారిగా సమావేశమవుతున్న ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ రాజధాని ప్రాంత రైతులు భారీ వింధును ఏర్పాటుచేశారు. ప్రజా రాజధాని నిర్మాణంలో భాగంగా తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించడం, భూములిచ్చిన రైతులకు ఆన్‌లైన్ డ్రా పద్ధతిలో ప్లాట్లు కేటాయించడం, రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపునివ్వడం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టడం వల్ల తాము ఆర్థికంగా బలోపేతమైనట్లు రాజధాని రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సంతోషాన్ని ప్రజాప్రతినిధులతో పంచుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణాన్ని వేదికగా చేసుకున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల రైతులు సమష్ఠిగా ఏర్పాటుచేసిన విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు పాల్గొని రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.