ఆంధ్రప్రదేశ్‌

సభకు రోజా హాజరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 6: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైకాపా ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. దాదాపు సంవత్సరం తరువాత ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆసెంబ్లీ ప్రాంగంలోకి వచ్చిన దగ్గర నంచి చాలా మంది ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగడం కనిపించింది. ప్రతిపక్ష నేత కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా దేవుడి పటం వద్ద ఆమె కొబ్బరికాయ కొట్టారు. ప్రతిపక్ష నేత చాంబర్‌లోని సీటులో జగన్ ఆశీనులైనప్పుడు ఆమె తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. సంవత్సరం తరువాత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం, మంగళవారం సస్పెన్షన్ వ్యవహారంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో అమె రాక అందరి దృష్టిని ఆకర్షించింది.
టిడిపి, వైకాపా కార్యకర్తల నినాదాల హోరు
పటమట: అమరావతి నూతన అసెంబ్లీ ప్రాంగణం దగ్గరలో సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ పార్టీ కార్యకర్తల మధ్య నినాదాల హోరు కొనసాగింది. ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బస్సులో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుటుండగా, అంతకుముందే నారా లోకేష్ అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయటానికి వెళ్ళారు. జగన్ ఎమ్మెల్యేల బస్సును చూసిన టిడిపి కార్యకర్తలు నారా లోకేష్ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తించారు. దీంతో అక్కడ జగన్‌ను చూడటానికి వేచి వున్న కార్యకర్తలు కూడా వెంటనే స్పందించి జగన్ జిందాబాద్ అంటూ నినాదాల హోరేత్తించటంతో అటు టిడిపి కార్యకర్తలు, ఇటు వైఎస్సార్ పార్టీ కార్యకర్తల నినాదాలు జోరందకున్నాయి.