ఆంధ్రప్రదేశ్‌

మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 6: ప్రధాని నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి అజేయశక్తిగా ఎదుగుతోందనడానికి ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే నిదర్శనమన్నారు. ముఖ్యంగా ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనాతీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలుపు తథ్యమన్నారు. ఇటీవల కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థిక వృద్ధి రేటు రెండేళ్ల వెనక్కు వెళుతుందని పలువురు విమర్శించారని, అయితే ఆర్థిక సర్వేలో మాత్రం వృద్ధిరేటు 7 శాతం దాటుతోందని తేలిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి దృష్టి సారించిందని, ఎపి సహా అన్ని రాష్ట్రాలకూ కేంద్రం చేయూతనిస్తోందన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని వంటి పోలవరం ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి విద్యా సంస్థలను పదేళ్లలోగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ 80 శాతం సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు దశాబ్దాల కాలంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సంస్థలు ప్రకటించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయని, ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు ఓటర్లు విజ్ఞత ప్రదర్శించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.