ఆంధ్రప్రదేశ్‌

పోలవరం డిజైన్లపై నిశిత పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, మార్చి 7: ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై నిశిత పరిశీలన జరుగుతోంది. ప్రాజెక్టులోని నిర్మాణాలకు సంబంధించిన డిజైన్ల ఆమోదం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ మంగళవారం కాంట్రాక్టు ఏజన్సీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
సిడబ్ల్యూసి మాజీ ఛైర్మన్ ఎపి పాండ్యన్ డ్యాం డిజైన్స్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పాండ్యన్ విలేఖర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులోని ప్రతి నిర్మాణం సక్రమంగా నిర్మించడానికి నిపుణులతో చర్చించి డిజైన్స్ ఆమోదిస్తున్నట్టు తెలిపారు. భూకంపాలు వస్తే తట్టుకునే విధంగా డిజైన్లు రూపొందించారా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఉదయం 9గంటలకే ఈ సమావేశం ప్రారంభమైందని, 23మంది డిజైన్స్‌కు సంబంధించి నిపుణులు హాజరైనట్టు ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం సాయంత్రం వరకూ ఈ సమావేశం జరుగుతుందని, నిర్మాణాలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ఈ బృందం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కమిటీ ఢిల్లీలో నాలుగుసార్లు సమావేశమై కొన్ని డిజైన్లు ఆమోదించిందన్నారు. ప్రస్తుత సమావేశంలో డయాఫ్రమ్ వాల్, ఎర్త్‌కం రాఫిల్ డ్యాం, ప్లేరేయర్స్‌కు సంబంధించిన డిజైన్లను ఈ కమిటీ సమీక్షిస్తోందని ఇఎన్‌సి తెలిపారు.