ఆంధ్రప్రదేశ్‌

ఉమ్మడి విచారణ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: అక్రమాస్తుల కేసులో తమపై దాఖలు చేసిన చార్జిషీట్లన్నీ కలిపి ఉమ్మడి విచారణ జరిపించాలని సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రతిపక్షనేత జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి విచారణ చేయాలన్న తమ పిటిషన్‌ను సిబిఐ కోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో మూడు పిటిషన్లను దాఖలు చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ సిబిఐ 11 కేసులను నమోదు చేసిందని, ఇందులో 8కేసులను హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. మూడు కేసులను మాత్రమే విచారించడం వల్ల తమకు న్యాయం జరగదన్నారు. కేసు దర్యాప్తు, విచారణలో పారదర్శకత ఉండాలని సుప్రీంకోర్టు అనేక కేసులు ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.