ఆంధ్రప్రదేశ్‌

ఇక రాష్ట్రంలో ప్రజలే పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 8: ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలే పోలీసులు కానున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో సమాజంలోని ప్రతి వ్యక్తి పోలీసు పాత్ర నిర్వహిస్తారు. తద్వారా శాంతి భద్రతల పరిరక్షణలో ‘ప్రజాపోలీసింగ్’ భాగస్వామ్యం కానుంది. ప్రతి జిల్లాలో త్వరలో ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చనుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా పని చేసిన సమయంలో పోలీసు వ్యవస్థలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు ‘మైత్రి కమిటీ’లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఓ మైత్రి కమిటీ ఏర్పాటు చేసి స్థానికులుగా ఉండే కొందరు ప్రముఖులను సభ్యులుగా చేర్చారు. అయితే తొలుత ఈ మైత్రి కమిటీలు సత్ఫలితాలిచ్చినా.. కాలక్రమంలో స్థానికంగా రాజకీయ జోక్యం పెరిగి ‘పైరవీ కమిటీ’లుగా మారాయి. దీంతో శాశ్వత కమిటీలు నిర్వహణకు స్వస్తి చెప్పి.. కమిటీల స్థానంలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఈక్రమంలో బాధ్యతను భుజానెత్తుకున్న డిజిపి నండూరి సాంబశివరావు రాష్ట్రంలో ప్రజాపోలీసింగ్‌ను తీసుకువచ్చే క్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికి సాంకేతిక పరిఙ్ఞనం కూడా తోడవుతోంది. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా ప్రతీ జిల్లాలోనూ పోలీసుశాఖ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. తద్వారా కేసులను ఛేదిస్తూనే.. మరోవైపు ప్రజలకు దగ్గరవుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా రూపాంతరం చెందింది. ఇదే సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకునే క్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడమే ప్రస్తుతం తెర మీదకు వచ్చిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రూపకల్పన జరుగుతోంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల దృష్ట్యా మరికొన్ని అంశాలు ప్రయోగాత్మకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి చేతిలోని సెల్‌ఫోన్ ఓ సిసి కెమెరాలా పని చేస్తుంది. ప్రతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే కమ్యూనిటీ పోలీసు వ్యవస్థను ప్రోత్సహించాలని డిజిపి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన యూనిట్ అధికారులకు వౌఖిక సూచనలు కూడా చేశారు. అయితే కమ్యూనిటీ పోలీసు వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలోని చిత్తూరు, కడప, తిరుపతి తదితర జిల్లాల్లో అక్కడి ఎస్పీలు అమలు చేస్తున్నారు. ఏర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అక్కడి పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసు వ్యవస్థ సత్ఫలితాలిచ్చింది. కర్నాటక, తమిళనాడు సరిహద్దులోని కొన్ని గ్రామాల్లో స్థానికులు పొట్టకూటి కోసం ఎర్రచందనం కూలీలుగా మారాల్సిన పరిస్థితి. దీంతో కేసుల్లో చిక్కుకుని చట్టం దృష్టిలో స్మగ్లర్లు, క్రిమినల్స్‌గా ఉంటున్నారు. అందువల్ల ప్రయోగత్మాకంగా ఆయా గ్రామాల్లో ‘ఎర్ర’ కూలీల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీసుశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఇప్పుడు జిల్లాల్లో విస్తరించిన కమ్యూనిటీ పోలీసింగ్ సత్ఫలితాలిస్తోంది. ఇటీవల డిజిపి చిత్తూరు జిల్లా పర్యటన సమయంలో ఆయన దృష్టికి వచ్చిన ఓ పబ్లిక్ ఫోన్‌కాల్‌పై ఆరా తీయగా.. అమ్మాయిలను అల్లరిపెడుతున్న ఈవ్‌టీజర్లను వీడియో తీసి ఓ మహిళ క్లిప్పింగ్స్ పంపింది. స్పందించిన డిజిపి ఆదేశాలతో మఫ్టీలో మహిళా పోలీసులు అక్కడకు వెళ్లి చర్యలు తీసుకున్నారు. ఇదేక్రమంలో కొద్దిరోజుల క్రితం డిజిపి సత్తెనపల్లి వెళ్లినప్పుడు కూడా కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎస్పీలు చర్యలు చేపడుతున్నారు. ప్రతి చోటా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ప్రజలు తమ చేతిలోని సెల్‌ఫోన్‌ను సిసి కెమెరాలా వినియోగించవచ్చు. తమ కళ్ళముందు జరిగే ఘటనలను వీడియో, ఫొటో తీసి వెంటనే జిల్లా ఎస్పీకి పంపితే చర్యలు ప్రారంభమవుతాయి. ఇందుకు ‘క్రైం స్టాపర్’ పేరుతో ఓ ప్రత్యేక ఫోన్ నెంబర్, వాట్సాప్ కూడా త్వరలో రానుంది.