ఆంధ్రప్రదేశ్‌

మోదీ కంటే బాబే గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి వచ్చే ఆలోచనలు మరెవరికీ రావని, ప్రధాని మోదీ అయినా.. చంద్రబాబు తర్వాతేనని టిడిపి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే తనకు ఏమాత్రం భయం లేదని, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ పోటీ చేసినా.. తాను కనీసం 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు తనకు పెద్ద లెక్క కాదన్నారు. ఎప్పుడు బరిలో దిగినా గెలుపు కైవసం చేసుకుంటానన్నారు. పవన్ విజయవాడలో పోటీ చేస్తే అయనపై పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. సిఎం చంద్రబాబు ఆలోచనలు గొప్పవని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబు ముందు మోదీ కూడా సరిపోడంటూ ఆకాశానికెత్తేశాడు. బిజెపితో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడా లేవన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు కాబినెట్‌లో చోటు లభిస్తుందా అన్న ప్రశ్నకు తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవికంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో జగన్ చురకలు
అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడే సమయంలో పదే పదే అడ్డు తగులుతున్న జలీల్‌ఖాన్‌పై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం, రైతులకు మద్దతు ధర, పారిశ్రామిక, ఇతర రంగాలు వంటి అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా.. జలీల్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జగన్ జలీల్‌నుద్దేశించి తాను చెబుతున్న లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్ళకు అర్థం కాకపోవచ్చని చురకలు వేశారు.
హలో.. ఫిజిక్స్: రోజా ఎద్దేవా
ఇదిలావుండగా.. బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఇంటర్వ్యూలో చెప్పి అభాసుపాలైన ఎమ్మెల్యే జలీల్‌ను ‘సెటైర్లు’ వెంటాడుతూనే ఉన్నాయి. అటు సభలోనూ.. ఇటు లాబీల్లోనూ.. ప్రతిపక్షం వ్యంగ్య బాణాలు విసురుతూనే ఉంది. సభలో జగన్ సెటైర్ వేస్తే.. లాబీలో వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే రోజా హలో.. ఫిజిక్స్ అంటూ జలీల్‌ను విష్ చేసింది. రోజా వస్తూనే లాబీలో అక్కడే ఉన్న జలీల్‌ఖాన్‌ను చూస్తూ నవ్వుతూ ఫిజిక్స్ అంటూ తట్టి పలుకరించడంతో అందరూ విస్తుపోయారు. మరో వైసిపి ఎమ్మెల్యే సునీల్ సరదాగా టీజ్ చేస్తూ బీకాంలో ఫిజిక్స్ అన్నా అని జలీల్‌తో చేయి కలిపారు. వెంటనే ఇక్కడ ఉన్నవారంతా పక్కున నవ్వేశారు. మీడియాలో హైలెట్ అవ్వాలంటే వాళ్లకు రివర్స్‌లో చెప్పానని, దీంతో రావాల్సిన దాని కన్నా.. ఎక్కువ ప్రచారం తనకు వచ్చిందని సమాధానమిచ్చిన జలీల్‌ఖాన్ సంబరపడటం విశేషం.