ఆంధ్రప్రదేశ్‌

కూచిపూడి బ్రాండ్ అంబాసిడర్‌గా అంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన వేడుకల్లో నృత్యకళాకారిణి అంబిక నృత్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ముగ్ధులయ్యారు. అప్పటికప్పుడే ఆమెను కూచిపూడి నృత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా ఆయన ఏ సభలో అయినా ముఖ్యమంత్రి నేరుగా వేదికపైకి వెళతారు. అయితే ఈ వేడుకల్లో భిన్నంగా జరిగింది. వేదిక ముందు ఆశీనులై మహిళల కూచిపూడి నృత్యాలను ఆసక్తిగా తిలకిస్తూ ఆస్వాదించారు. పైగా ఒక్కో అంశం పూర్తిగాగానే కళాకారులను తన వద్దకు రప్పించుకుని గ్రూప్ ఫొటో దిగారు. రెండో అంశంగా నర్తకి అంబిక మూడు రంగుల రింగులతో వందేమాతరం గీతంతో చేసిన కూచిపూడి నృత్యం ఆహూతులను ఎంతగానో అలరించింది. నృత్యానంతరం అంబికను పిలిపించుకుని తన పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడారు. కుటుంబ విషయాలు తెలుసుకున్నారు. వెంటనే కార్యదర్శి ప్రద్యుమ్నతో చర్చించి ఓ ప్రకటన చేశారు. కూచిపూడి నాట్యానికి పూర్వవైభవం తీసుకురావటానికి చేస్తున్న కృషిలో భాగంగా అంబికను కూచిపూడి నాట్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గానే కాకుండా ఒక సలహాదారునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పివి సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
11 మంది మహిళలకు సత్కారం
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన 11 మంది మహిళలు, అధికారిణులను సిఎం చంద్రబాబు అవార్డుతో, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. వీరిలో దారా కరుణశ్రీ (విజయవాడ), మంగాదేవి (గుంటూరు), తెనాలి వసంత లక్ష్మి (నెల్లూరు), మల్లెల నిర్మల కుమారి (విశాఖ), ముత్యం లక్ష్మి (విశాఖ), బి వెంకట నాగమ్మ (కర్నూలు), ఎరుకుల రాజేశ్వరమ్మ (కర్నూలు), దొడ్డంపూడి శారద (గుంటూరు), కామిశెట్టి విశాలక్ష్మి (కడప), పివి సంధ్య (కడప), బత్తుల ఝాన్సీ (ప్రకాశం), జె ప్రణీత (అనంతపురం), జె జయసుధ (కృష్ణా) ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి 8 మంది పారిశుద్ధ్య కార్మికులను కూడా సత్కరించారు.