ఆంధ్రప్రదేశ్‌

ఆస్తులతో ప్రజలను మోసగించిన లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 9: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వెల్లడి ద్వారా ప్రజలను పచ్చి మోసం, దగాకు గురి చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఐదు నెలల క్రితం ఎంతో గొప్పగా, నిజాయితీగా తాము ఆస్తులు ప్రకటిస్తున్నామని చెప్పి 14.50 కోట్ల రూపాయలుగా చూపిన లోకేష్ తాజాగా 330.14 కోట్లకు పెంచేసిన వైనం రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. గురువారం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ తండ్రికి తగ్గట్టుగానే తనయుడు కూడా కళ్లార్పకుండా అబద్దాలను అద్భుతంగా వల్లెవేస్తున్నారన్నారు. నాడు మార్కెట్ వాల్యూ ప్రకటించలేదని, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చానని లోకేష్ చెప్పడం ఇంతకన్నా దగా, మోసం మరొకటి లేదన్నారు. 2011 సంవత్సరం నుంచి చంద్రబాబు కుటుంబం ఆస్థుల ప్రకటన డ్రామాకు తెరతీశారని, ఆ నాటి నుంచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని అన్నారు. 2004 జనవరిలో హెరిటేజ్ షేర్ 55 రూపాయలు ఉండగా 2009 నాటికి 41 రూపాయికి పడిపోయిందన్నారు. 2014 జనవరి 17న 220 రూపాయలున్న షేర్ అదే ఏడాది మార్చిలో 200 రూపాయలకు తగ్గిందని తెలిపారు. అయితే టిడిపి ప్రభుత్వం అధికార పీఠమెక్కడంతో ఊపందుకున్న షేర్ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఏకంగా 1134 రూపాయల రికార్డు స్థాయికి ఎగబాకడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఎక్కడా కూడా పాల ఉత్పత్తి పెరగడం గానీ, ధరల్లో తీవ్ర వ్యత్యాసం గానీ చోటు చేసుకోకుండా ఇదెలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. జగన్ కంపెనీల మీద సిబిఐ కేసులు నడుస్తున్నాయని మీ కంపెనీపైనా, ఓటుకు నోటు కేసుపైనా విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. జగన్ తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవ్వరినీ బలి చేయలేదని, చంద్రబాబే ఎన్‌టిఆర్‌ను బలిచేసి సిఎం అయ్యాక రాష్ట్ర ప్రజలందరినీ బలి చేశారని అంబటి పేర్కొన్నారు.