ఆంధ్రప్రదేశ్‌

బ్రిటీష్ కౌన్సిల్ సాయంతో సాఫ్ట్ స్కిల్స్‌పై ఆన్‌లైన్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: రాష్ట్రంలోని విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మరింతగా పెంపొందించి, పోటీ ప్రపంచంలో రాణించేందుకు వీలుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటీష్ కౌన్సిల్ ముందుకు వచ్చింది. డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషా నైపుణ్యాలు, ఉద్యోగిత నైపుణ్యాలు, అత్మవిశ్వాసం పాదుకొల్పేందుకు ఆన్‌లైన్‌లో శిక్షణను కౌన్సిల్ ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు శిక్షణ ఏ విధంగా ఉండాలన్న అంశంపై వెలగపూడి సచివాలయంలో బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత విద్యా శాఖాధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ తరగతులు ఆన్‌లైన్‌లో ఏలా నిర్వహించాలన్న దానిపై ఉన్నతాధికారులు, నిపుణులు వివరంగా చర్చించారు. 15 నెలల పాటు ఉండే ఈ కోర్సులను లక్ష మంది విద్యార్థులకు బోధించనున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని శిక్షణ ఇస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని కొంతమంది వర్సిటీల అధికారులు తెలిపారు. ఇంగ్లీషు క్లబ్బులు, మొబైల్ లెర్నింగ్ సమ్మిళితంగా ఈ కోర్సులను రూపొందించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి వరదరాజన్, తదితరులు పాల్గొన్నారు.