ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం హయాంలోనే బిసిలకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: బిసిలకు రాజకీయ గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం బలహీన వర్గాలకు తాము అండగా ఉంటామన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడిని ఎమ్మెల్సీగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయటానికి అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని గురువారం ఆయన కార్యాలయంలో కలిసింది. బిసిలను తాము కేవలం ఓటు బ్యాంకుగానే చూడటం లేదని, వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. వెంగళరావు మాట్లాడుతూ బిసిల్లో తమది అతి పెద్ద సామాజిక వర్గమని, తెలుగుదేశం పార్టీ తమకు మంచి గుర్తింపునిచ్చిందని ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో యాదవ మహాసభ కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడు ఎవిఆర్ రాజు, ప్రధాన కార్యదర్శి కొణతం శ్రీనివాస యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకటాద్రి, యాదవ మహాసభ నేతలు, తదితరులున్నారు.