ఆంధ్రప్రదేశ్‌

గ్యాస్ సిలిండర్ల లారీ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం, మార్చి 9: విశాఖ జిల్లాలోని పెందుర్తి-ఆనందపురం జాతీయ రహదారిపై గుడిలోవ వద్ద బుధవారం అర్థరాత్రి దాటాక సిలిండర్ల లారీ బోల్తాపడి అగ్నికి ఆహుతైంది. ఐఒసి నుంచి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ గుడిలోవ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి తాటిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ చెట్టు విరిగి రహదారి పక్కన ఉన్న హై ఓల్టేజీ విద్యుత్ లైన్‌పై పడగా వైర్లు తెగి సిలిండర్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా సిలిండర్లు పేలాయి. లారీ డ్రైవర్ తప్పించుకొని వంద మీటర్ల దూరంలో ఇతర వాహనాలను నిలిపివేశాడు. అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిలిండర్లు పేలుతునే ఉన్నాయి.

చిత్రం.. పేలుడు ధాటికి తునాతునకలైన సిలిండర్లు