ఆంధ్రప్రదేశ్‌

బెజవాడవైపు జగన్ చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: రాష్ట్ర రాజధాని అమరావతిలో పార్టీ కార్యకలాపాలు ఇకపై మరింత ముమ్మరం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ మేరకు శాశ్వత భవనం నిర్మించుకునే వరకూ విజయవాడ నగరంలోనే తాత్కాలికంగానయినా నివాసం ఉండాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాజధాని నగరమైన విజయవాడలో పార్టీ పట్టుసాధించాలంటే అక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గ హవాను ఎదుర్కొనేందుకు మరొక బలమైన కాపు సామాజికవర్గ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. కాపులతోపాటు, నగరంలో బలంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, యాదవ వర్గాలనూ సమన్వయం చేసుకుంటేనే బెజవాడలో ఉనికి చాటుకోగలమని గ్రహించిన జగన్, ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో నగర స్థాయిలో కీలకనేతగా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేను త్వరలో పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనకు నగర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. యాదవ వర్గానికి చెందిన పార్ధసారథిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
కాగా, ఇక రాజధాని నగరాలైన గుంటూరు, విజయవాడలో పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించిన జగన్, తాను కూడా విజయవాడలోనే నివాసం ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. తాము దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతోందని, తన పార్టీ నేతలు కూడా హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని జగన్ గ్రహించారు. ఇటీవల విజయవాడ-గుంటూరులో రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేందర్‌రెడ్డి, అంబటి రాంబాబు సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం వచ్చిన విషయాన్ని గ్రహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాను రాజధానిలో ఉంటే అధికారపార్టీ కూడా జాగ్రత్తగా ఉంటుందని, నేతలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన గ్రహించారంటున్నారు. పార్టీ కార్యకలాపాల వేడి పెంచడం వల్ల కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని, తాను హైదరాబాద్‌లో ఉండి, ఆంధ్రలో పార్టీని బలోపేతం చేయడం కష్టమన్న విషయాన్ని జగన్ ఆలస్యంగా గ్రహించారంటున్నారు. విజయవాడ, గుంటూరులో మీడియా సహా అన్ని రంగాల్లోనూ ఒకే సామాజికవర్గం హవా ఉన్నందున, ఇప్పటివరకూ మిగిలిన పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మీరు వస్తే ఈ పరిస్థితి మారుతుందని పార్టీ సీనియర్లు సూచించారు. అదేవిధంగా ఆ సామాజికవర్గం దూకుడుపై రాజధాని రెండు జిల్లాల్లోని మిగిలిన వర్గాలు ఆగ్రహంగా ఉన్నందున, వారికి చేరువకావాలంటే మీరు ఇక్కడే ఉండాలన్న వారి సూచనలను జగన్ అంగీకరించారంటున్నారు. కాగా, జగన్‌కు తన నివాసం ఇచ్చేందుకు వెల్లంపల్లి సిద్ధం కాగా, సువిశాలమైన తన స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్ధసారథి పార్టీ అధినేతను కోరినట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ఘటనపై ప్రభుత్వం తనపై కేసులు పెట్టినా, ఆ సంఘటనలో ప్రజలు తననే సమర్థిస్తున్నారన్న విషయం సర్వే ద్వారా తెలుసుకున్న జగన్, ముందు విజయవాడ, కృష్ణాజిల్లాపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. విజయవాడలో తన సామాజికవర్గ బలం తక్కువయినా కాపు, బ్రాహ్మణ, వైశ్య, యాదవ వర్గాలతో కలసి తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న సామాజికవర్గాన్ని ఎదుర్కోవడం సులభమవుతుందన్న వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నారు.

చిత్రం..వైఎస్ జగన్