ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాల్టీల్లో మార్చినెల హడావుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 10: రాష్ట్రంలోని మున్సిపాలిటీల దృష్టంతా పన్నుల వసూళ్ల పైనే వుంది. పంచాయతీల్లో పెంచిన పన్నులను వసూలు చేస్తుంటే, మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమల్లోవున్న పన్నుల వసూలుకు అధికార్లు హడావుడి పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో ఆన్‌లైన్ విధానంలో ఏ రోజు ఎంత వసూలైందనేది ఎప్పటికపుడు రాష్ట్ర స్థాయిలో సమీక్షించుకుంటున్నారు. ఖజానాకు రోజువారీ చేరుతోన్న పన్నుల మొత్తాలను మున్సిపల్ పరిపాలన శాఖ నిత్యం సమీక్షిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జోన్ల వారీగా పన్నుల విధానం ఎప్పటికపుడు సమీక్షించడానికి మరింత అవకాశం కుదిరింది.
రాష్ట్రం మొత్తం మీద రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుల కార్యాలయం (ఆర్‌డి) పరిధిలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు పన్నుల వసూళ్లలో ముందంజలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.192.27 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇంకా రూ. 110 కోట్లు వసూలు కావాల్సి వుంది. మొత్తం రూ.302.27 కోట్ల లక్ష్యం మేరకు నెలాఖరులోగా మొత్తం పన్నులను వసూలు చేస్తామంటున్నారు. 9వ తేదీ ఒక్క రోజే పరిశీలిస్తే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రూ.23 లక్షలు, విజయవాడ నగరపాలక సంస్థలో రూ.57 లక్షలు, కాకినాడ నగరపాలక సంస్థలో రూ.20 లక్షలు, ఏలూరు నగరపాలక సంస్థలో రూ.9 లక్షలు వసూలైంది. మిగిలిన మున్సిపాల్టీలలో ఒక లక్ష నుంచి మూడేసి లక్షల చొప్పున వసూలైనట్లు ఆన్‌లైన్ లెక్కల ద్వారా నిర్ధారణ జరిగింది. మొత్తం ఈ మూడు జిల్లాల్లో 9వ తేదీ ఒక్క రోజే రూ.1.45 కోట్ల ఆస్తి పన్ను వసూలవ్వడం విశేషం.
మున్సిపాలిటీల్లో వేసవి దాహార్తిని దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు అత్యవసర పనుల నిమిత్తం నిధుల సమీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు మున్సిపల్ ఆర్డీ సకలారెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ప్రతిపాదనలు అందాల్సి వుంది.
తూర్పు గోదావరి జిల్లాలో అయితే మంచినీటి సమస్యలు పెద్దగా లేవని, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని, అయినప్పటికీ ఎక్కడైనా శివారు ప్రాంతాల్లో అత్యవసరంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించేందుకు గానీ, మంచినీటి సరఫరా వ్యవస్థలో తలెత్తే అత్యవసర మరమ్మతులు, బోర్‌వెల్స్ లోతు చేయడం, లీకేజీలు అరికట్టడం తదితర పనుల నిమిత్తం రూ.4.39 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.