ఆంధ్రప్రదేశ్‌

యువతి గ్యాంగ్‌రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 17: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కేరళకు చెందిన ఒక యువతిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బైక్‌పై తీసుకెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితురాలు గాయపడింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమెను ఆసుపత్రిలోచేర్చి రేపిస్టులు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..కేరళకు చెందిన 26ఏళ్ల యువతి నగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తోంది. స్థానిక రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న ఆమె శనివారం రాత్రి దానవాయిపేటలోని టిటిడి కళ్యాణమండపంలో పెళ్లి అలంకరణ కోసం మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తుండగా మద్యం సేవించివున్న కక్కల సతీష్‌కుమార్, తాడేపల్లి ప్రేమ్‌కుమార్, స్టిక్, మణికంఠ అనే నలుగురు రౌడీషీటర్లు ఆమెను అడ్డగించి, బలవంతంగా తమ మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని లాలాచెరువు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను బైక్‌పై టిటిడి కళ్యాణమండపం వైపునకు తీసుకువస్తుండగా నందంగనిరాజు జంక్షన్ వద్ద మోటార్‌సైకిల్ అదుపుతప్పి, లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో యువతి చెయ్యి విరగడంతోపాటు, స్వల్పంగా గాయపడింది. నిందితుల్లో ఇద్దరు కూడా గాయపడ్డారు. గాయపడిన యువతిని విఎల్‌పురంలోని ఒక ఆసుపత్రిలో చేర్చి నిందితులు పరారయ్యారు. ఆసుపత్రి వర్గాలద్వారా రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దక్షిణ మండలం డిఎస్పీ శ్రావణి బాధితురాలిని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హోంమంత్రి ఆరా
ఈ ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. బాధితురాలికి తక్షణం మెరుగైన చికిత్స అందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికార్లను ఆదేశించారు.