ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురానికి చెందిన దారావత్తు బుజ్జి (36) పొలం పనులకు వెళ్లగా, పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అదే విధంగా వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన నరాల సీతారామిరెడ్డి (50) శుక్రవారం గేదెలు మెపేందుకు పొలానికి వెళ్లగా, మధ్యాహ్నం కురిసిన వర్షంతోపాటు పిడుగు పడడంతో మృతి చెందాడు. అదే విధంగా నందిగామ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీలు చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి మిర్చి కోతలకు వెళ్లి పిడుగుపాటుకు గాయపడ్డారు. వెంటనే వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గుంటూరు జిల్లా అచ్చంపేట సమీపంలో పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు మిరపకోతలకు వెళ్లి వర్షం కారణంగా చెట్టుకింద తలదాచుకుంటున్న సమయంలో సమీపంలోనే పిడుగు పడటంతో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఏపూరి పద్మ (46) అనే మహిళ ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి వలస వచ్చిన కూలీలు తాడువాయి పొలాల్లో గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తుండగా, పిడుగుపాటుకు 12 మంది గాయపడ్డారు.
కడప జిల్లాలో ఒకరు..
పెండ్లిమర్రి: కడప జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పొలం వద్ద వదిలివచ్చిన వేరుశెనగ కాయలు తడిసిపోతాయని భావించి గ్రామానికి చెందిన చిలేకాంపల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి(16), నాగేంద్రారెడ్డి వెళ్లారు. కాయలపై పట్టలుకప్పి తిరిగి వస్తుండగా వీరిపై పిడుగు పడింది. దీంతో ప్రదీప్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.