ఆంధ్రప్రదేశ్‌

పత్రిక వెబ్‌సైట్‌లో బ్లూఫిలిం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 10: ఒక పత్రిక వెబ్‌సైట్‌లో తాజాగా వెలుగుచూసిన బ్లూఫిలిం క్లిప్పింగ్‌పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. శాసనసభను, మహిళలను అవమానించే రీతిలో కథనం మధ్యలో బ్లూఫిలిం క్లిప్పింగ్ ఉంచడాన్ని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కాటూరి శ్రీనివాసరావు అనే జర్నలిస్టు సీరియస్‌గా తీసుకుని, వెబ్‌సైట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు జాయింట్ కమిషనర్ పి హరికుమార్‌కు శుక్రవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జర్నలిస్టు శ్రీనివాసరావు ఫిర్యాదు ప్రకారం.. ఈనెల 5వ తేదీన ఆ పత్రికకు చెందిన వెబ్‌సైట్‌లో సాయంత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫోటోలతో ఒక కథనం రాశారు. అయితే, ఆ కథనం మధ్యలో సెక్స్‌డేటింగ్ అన్న హిందీపదాలతో ఉన్న ఒక బ్లూఫిలిం క్లిప్పింగ్ ఉంచారు. అదే కథనం కింద తిరిగి అదే క్లిప్పింగ్ రెండుసార్లు ప్రదర్శించారని ఫిర్యాదు చేశారు. పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు పరీక్షలు రాస్తున్నారని, వార్తల కోసం వెబ్‌సైట్ చూస్తున్న వారిని ఇలాంటి అనాగరిక దృశ్యాలు ప్రభావితం చేస్తే, వారి భవిష్యత్తు ఏమిటన్న బాధతోనే ఈ ఫిర్యాదు చేశానన్నారు. లక్షలమంది చూసే పత్రిక వెబ్‌సైట్‌లో ఉంచిన బ్లూఫిలిం క్లిప్పింగుల వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళల మనోభావాలు దెబ్బతిన్నందున, ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దానిని పరిశీలించి, విచారణ జరిపిస్తామని జాయింట్ కమిషనర్ హామీ ఇచ్చారని శ్రీనివాసరావు చెప్పారు. ఈ సందర్భంగా మార్చి 5న వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలు సీడీ, కథనాలను అందచేశారు. తాను రేపు స్పీకర్‌ను కలసి ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు.