ఆంధ్రప్రదేశ్‌

నిస్సహాయులకు సిఎం సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: పుట్టుకతో అంగవైకల్యం, చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన దయనీయ స్థితి. స్థిమితంగా చిన్న ఉద్యోగం చేయటానికే కుదరని నిస్సహాయుడు. అతడి పేరు జంధ్యం వెంకటేశ్వరరావు. శుక్రవారం కృష్ణాజిల్లా ప్రసాదంపాడు నుంచి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. తన కష్టాన్ని వివరించి సహాయం అడగటానికి ముందుకు రాబోగా, సిఎం అతని పరిస్థితి చూసి వారించి తానే అతడి సమీపానికి వెళ్లారు. వెంకటేశ్వరరావుకు ఒక గృహాన్ని మంజూరు చేశారు. రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి గతంలో పెన్షన్ కూడా మంజూరు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వాసి, వయోవృద్ధుడు ఆర్వేటి గుప్త, ఆర్థిక కష్టాలతో భుక్తి గడవని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు ముఖ్యమంత్రి ఇల్లు, పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబండ గ్రామవాసి బొంతు ఇందిర భర్త 2004లో మరణించారు. భర్త ఉద్యోగాన్ని తన కుమార్తెకు ఇవ్వాలని ఆయన భార్య ఇందిర అర్జీ పెట్టుకున్నారు. ఇంతవరకూ తన భర్త పెన్షన్ డబ్బులు, పిఎఫ్ రాలేదని చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..చక్రాల కుర్చీకే పరిమితమైన వెంకటేశ్వరరావుతో మాట్లాడుతున్న సిఎం