ఆంధ్రప్రదేశ్‌

వైకాపాను దీటుగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యూహాత్మక అడుగులు వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 40 మంది ఎమ్మెల్యేలకు ఆదివారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తొలివిడత ఎంపికైన సభ్యులు హాజరై పలు అంశాలపై చర్చించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఆరోపణలను ఏ రకంగా తిప్పికొట్టాలనే విషయమై సీనియర్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బడ్జెట్‌తో పాటు ఆయా నియోజకవర్గ ప్రజాసమస్య లే అజెండాగా పరిష్కారానికి తీసుకు న్న చొరవ, తదితర వివరాలతో సిద్ధం కావాలని కొత్త ఎమ్మెల్యేలకు సూచించారు. గుంటూరు జిల్లా కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, తదితరులు బడ్జెట్‌పై వైసిపితో ఎదురుదాడికి అనుసరించాల్సి న వ్యూహంపై చర్చించారు. స్థానిక సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు సంబంధిత మంత్రుల వివరణతో పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించాలని సూచించారు. సమావేశం జరుగుతుండగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెం దినట్లు సమాచారం అందడంతో అర్ధంతరంగా ముగించారు.

చిత్రం..శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు