ఆంధ్రప్రదేశ్‌

ఆస్పత్రిలో చేరిన రాయపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 12: నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్యులు సాధారణ పరీక్షలు నిర్వహించారు. మోకాళ్ల నొప్పులకు సంబంధించి శస్తచ్రికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు సూచించారు. రెండురోజుల పాటు పరిశీలనలో ఉంటే తగిన వైద్యం అందించగలమని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న రాయపాటిని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నేతలు కనగాల చిట్టిబాబు తదితరులు పరామర్శించారు.