ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ప్రహ్లాదవరదుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 12 : కర్నూలు జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాదవరదుని రథోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, ఆలయ ఇఓ మల్లికార్జునప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చి భక్తుల జయజయధ్వనాలు, గోవింద నామస్మరణ మధ్య రథాన్ని లాగారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథంపై ఆశీనుడైన శ్రీప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు.
కర్నూలు జిల్లా దిగువ అహోబిలంలో రథంపై విహరిస్తున్న ప్రహ్లాదవరదుడు