ఆంధ్రప్రదేశ్‌

అద్దంకి విడిచివెళ్లవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 13: రాష్ట్రంలో ఇద్దరు నేతల అధిపత్యపోరు, ఘర్షణ ఫలితంగా ప్రతిష్టాత్మకమైన పార్టీ సభ్యత్వాలు కూడా జరగని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్, చివరకు పార్టీ నాయకత్వం మాట కూడా ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది. ఇటీవల విధానమండలి సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నేత కరణం బలరామ్‌కు టికెట్ ఇచ్చే ముందు.. ఇకపై అద్దంకి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కే నియోజకవర్గాన్ని వదిలేయాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఆ తర్వాత జరిగిన జిల్లా సమావేశంలోనూ కరణం బలరామ్, పోతుల సునీతలను అద్దంకి, చీరాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎమ్మెల్యేలే అక్కడ ఇన్చార్జిలుగా ఉంటారని స్పష్టం చేసిన విషయం మీడియాలోనూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఎమ్మెల్సీ కరణం బలరామ్ క్యాంపు కార్యాలయమైన ముళ్లమూరులో ఆయన తనయుడు, అద్దంకి ప్రస్తుత టిడిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. దీనికి రెండువేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన పార్టీ నేతలు.. మీరు అద్దంకి విడిచివెళ్లేందుకు వీల్లేదని, మూడేళ్లయిపోయింది. ఇంకో ఏడాది వరకే ప్రభుత్వం మాట ఎవరైనా వినేది. ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ మాకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికే పనులు చేస్తున్నారు. మాకు పెన్షన్లు, ఇళ్లు అన్నీ ఆపేశారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా మాకొచ్చిన నష్టమేమీ లేదు. మాకు పనులు జరగకపోయినా ఫర్వాలేదు. మీరు మాత్రం అద్దంకి విడిచిపెట్టడానికి వీల్లేదు. దీనికోసం ఏమైనా చేస్తాం. మాకు మీరు ముఖ్యం.. అని భావోద్వేగంగా ప్రసంగించారు. 2004లో గరటయ్య చేసిన తప్పు మీరు కూడా చేయవద్దని సూచించారు. దీనికి స్పందించిన కరణం వెంకటేష్.. అద్దంకి విడిచిపెట్టమని గానీ, అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని గానీ బాబుగారు ఆయనంతట ఆయన మాకు చెప్పలేదు. మా కుటుంబం మీతోనే ఉంటుంది. మీరు చెప్పినట్లే చేస్తుంది. మాకోసం నిలిచిన కార్యకర్తలు, ప్రజల మాట వింటామని స్పష్టం చేశారు. దీనితో అద్దంకిలో కరణం-గొట్టిపాటి మధ్య జరుగుతున్న అధిపత్యపోరు కొత్తమలుపు తిరగనుంది.