ఆంధ్రప్రదేశ్‌

పనిచేసే ప్రభుత్వాలకే ప్రజాదరణ : బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: పనిచేసే ప్రభుత్వాలకు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ‘నీరు-ప్రగతి’పై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీపై ప్రజల విశ్వాసానికి ఇటీవల వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నిక ఫలితాలే నిదర్శనంగా పేర్కొన్నారు. భవిష్యత్తు పట్ల ప్రజల ఆశలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయన్నారు. తనతో భేటి సందర్భంగా నంద్యాల రోడ్ల అభివృద్ధి గురించి భూమా నాగిరెడ్డి ప్రస్తావించిన విషయం గుర్తుచేశారు. ఆళ్లగళ్ల, నంద్యాలలో రోడ్లు, మంచి, సాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 15 రోజులే ఉందంటూ, ఉపాధి హామీ పథకం నిధులు పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 2, 66, 729 పంట కుంటల తవ్వకం పూర్తయిందని, రోజుకు 500 తవ్వాలన్న లక్ష్యం చేరుకోవాలన్నారు. పనులు ప్రారంభించిన 4 లక్షల పంట కుంటలు పూర్తిచేయడంపై శ్రద్ధ పెట్టాలన్నారు. పంటకుంటల తవ్వకం, సోక్ పిట్స్ తదితర అంశాల్లో జలవనరులశాఖ, ఉపాధి హామీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. సిమెంటురోడ్ల నిర్మాణం 4,697 కిమీ పూర్తయిందని, టార్గెట్‌లో మిగిలిన 303 కిమీ పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో ఏమైనా ఆటంకాలుంటే గ్రామీణాభివృద్ధి, ఆర్థిక, మహిళా సంక్షేమ శాఖలు సమన్వయంగా పనిచేసి వెంటనే పూర్తిచేయాలన్నారు. ప్రజల కష్టాలు తీర్చే అవకాశం మనకు వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచ్‌లు, ఉపాధి హమీ సిబ్బంది మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ‘మనవల్ల గ్రామం బాగుపడుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు’ అనేది అందరూ గుర్తించాలన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే గ్రామాలు బాగుపడవు, దానివల్ల ఇబ్బందులు పడేది ప్రజలేననేది గుర్తుంచుకుంటే ఎటువంటి పొరపాట్లు, లోపాలు జరగవన్నారు.