కృష్ణ

మంచినీటి ఎద్దడ లేకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కార్యాలయంలో మంచినీటి సరఫరా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగాయలంక, కోడూరు మండలాల్లో మంచినీరు అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ బెనహర్ మాట్లాడుతూ నాగాయలంక మండలంలో అంబేద్కర్ నగర్, చోడవరం గ్రామాలకు ఈనెల 14 నుండి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈనెల 21 నుండి పెదకమ్మవారిపాలెం, చిన్నకమ్మవారిపాలెం, గుల్లలమోద గ్రామాలకు, 25 నుండి బావదేవరపల్లి, మే 1 నుండి కమ్మనమోల పథకం పరిధిలోని అన్ని గ్రామాలకు మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఉన్న 25 గ్రామాలను గుర్తించామని, ఈ గ్రామాలకు రూ.2.53 కోట్లు అవసరమైనట్లు అధికారులకు ప్రతిపాదన పంపామన్నారు. మొత్తం 51 చెరువులకు గాను 44 చెరువులు కాలువల కింద ఉండగా 20 చెరువులకు మాత్రమే నీటిని తోడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, నాగాయలంక ఎఇలు శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 18: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎవివి ప్రసాద్ విమర్శించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు వల్ల సాగునీరందక పంట నష్టపోయిన కౌలు రైతులకు కౌలు రద్దు చేయాలని, 2016-17 సంవత్సరానికి తిరిగి కౌలు చేసుకునే అవకాశం కల్పించాలని, కౌలు కాల పరిమితి మూడు సంవత్సరాలు తప్పక ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే కౌలు మినహాయింపు ఇవ్వాలని, జివో నెం. 379 ప్రకారం భూమి లేని పేద రైతుగా గుర్తింపబడిన దేవాదాయ రైతు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ధ్రువీకరించుకునే పద్ధతి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోదుమూడి రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు దేవభక్తుని నిర్మల, రైతు సంఘం నాయకురాలు సీతారావమ్మ, ఎం యల్లమందరాము, వెలగపూడి ఆనంద్, తుమ్మా చినకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
‘మడ’తో బందరుకు ఉజ్వల భవిష్యత్తు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 18: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ)తో ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అన్నారు. సోమవారం ఆయన మచిలీపట్నం వచ్చారు. ‘మడ’కు సంబంధించిన పూర్తి వివరాలను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడును అడిగి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో రెవెన్యూ శాఖ తయారు చేసిన ‘మడ’ మ్యాప్ ద్వారా భూగోళ భౌతిక పరిస్థితులను తెలుసుకున్నారు. మడ పరిధిలోని 27 గ్రామాలు ఉండగా లక్షా 5వేల ఎకరాలు మడ స్వాధీనంలోకి వచ్చినట్లు జెసి గంధం చంద్రుడు తెలిపారు. అనంతరం పాత ఓడరేవు, మంగినపూడి బీచ్‌ని ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు ఉన్నారు.