ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాది దేశంలో క్లిష్ట పరిస్థితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఈ ఏడాది దేశంలోను, రాష్ట్రంలోను విపరీత పరిస్థితులు నెలకొంటాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శనితో కలిసి కుజుడు వృశ్చిక రాశిలో ఉండే ఎనిమిది నెలల కాలం పలు వైపరీత్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పీఠంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రెండు సార్లు కాలసర్పదోషం నెలకొంటుందని, దీని ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు వేసవిలో విపరీతమైన ఎండలు మండిస్తాయని ఆయన వెల్లడించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదాలు లేకపోలేదన్నారు. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు దైవానుగ్రహం అవసరమన్నారు. దేశ హితం, ప్రజలు, రైతుల క్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో జీవించాలన్నదే శ్రీ శారదాపీఠం లక్ష్యమని ఆయన వివరించారు. కాలసర్పదోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాసాంజనేయ స్వాములకు మహా కుంభాభిషేకాలు నిర్వహించనునట్టు తెలిపారు. శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 18 వరకూ ఈ విశేష హోమాలు, పూజలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమాలను సినీనటుడు, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ దంపతులు 14న ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, సిద్ధా రాఘవరావు, ఇంకా పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17,18 తేదీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిష్ణాతులైన వ్యాకరణ, వేదాంత పండితులను ఆహ్వానించి వారితో హోమాలు చేయించనున్నట్టు స్వామీజీ తెలిపారు.

శ్రీశైలంలో శివరాత్రి ఏర్పాట్లు
శ్రీశైలం, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం శ్రీశైలం వచ్చిన మంత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 10 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున అదనపు క్యూ కాంప్లెక్సులు, సిబ్బందికి వసతి గృహాలు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వసతి సముదాయం నిర్మించడానికి దేవాదాయశాఖ చర్యలు చేపడుతోందన్నారు. కాలినడక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. తాగునీరు, వసతి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. శ్రీశైలంలో ఆయుర్వేద వైద్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కేరళకు చెందిన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులతో ఇక్కడ వైద్యసేవలు అందిస్తామన్నారు. శ్రీశైలం రహదారులను మరింత అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేశాఖతో చర్చించి శ్రీశైలానికి రైల్వేట్రాక్ పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.