ఆంధ్రప్రదేశ్‌

సమస్యలవైపే నిలబడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: కోట్ల సంపాదన కంటే సమస్యలవైపే తాను నిలబడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం నాడు చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భవించి మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ డాట్ ఆర్గ్ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పిఆర్పీ కోసం తాను చాలా పనిచేశానని, రాజకీయంగా చిరంజీవితో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి గుర్తింపు లభించిందని, ఉభయ రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్, ప్రవేశపరీక్షల కారణంగా పార్టీ కార్యకలాపాల విషయంలో జూన్ నుండి వేగం పెంచాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి పార్టీకి సంస్థాగత యంత్రాంగాన్ని సిద్ధం చేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 60 శాతం టిక్కెట్లు యువతకే ఇస్తామని, రెండు రాష్ట్రాల్లో సమస్యలపై పోరు కొనసాగిస్తామని అన్నారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని, తాను అనవసరపు ప్రకటనలు చేయనని, ఏం మాట్లాడినా తాను దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అన్ని విషయాల్లో తాను ఆచితూచి వ్యవహరిస్తున్నానని, గతంలో ప్రజారాజ్యం పార్టీ సరైన విధివిధానాలతో పోకుండా సొంత అజెండాలు తెరమీదకు రావడం చూశానని అన్నారు. పార్టీ ఆలోచనా విధానాలను ప్రజలతో పంచుకునేందుకే వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించామన్నారు. రెండు రాష్ట్రాల్లో కార్యకర్తల స్థాయి నుండి పార్టీ నిర్మాణం జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు అవసరమో లేదో పార్టీ నిర్మాణం తరువాత నిర్ణయించుకుంటామన్నారు. రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయం ఉండాలనేదే తమ అభిప్రాయమని అన్నారు. అధికారంలోకి వస్తామా రామా అన్నది ముఖ్యం కాదని, ప్రజా సమస్యలను బలంగా ముందుకు తీసుకువెళ్లాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. పూర్తిగా అనుకున్న స్థాయికి చేరలేకపోవచ్చని, స్ఫూర్తి మాత్రం అలాగే ఉందని అన్నారు.