ఆంధ్రప్రదేశ్‌

పశువులకున్న జాలి కూడా జగన్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రకటించని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీరు, ఆ తర్వాత ఆయన పార్టీనేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ‘ఇప్పుడే మనవాళ్లు చెబుతున్నారు. సాటిజీవి చనిపోతే పక్షులు, పశువులు కూడా సానుభూతి చూపుతాయి. కానీ జగన్ ఆ మాత్రం సానుభూతి కూడా చూపలేకపోయారా’ అని సభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు ప్రశ్నించారు. తన వల్లే భూమా మరణించారన్న వైసీపీ విమర్శలు ప్రస్తావిస్తూ ‘నాగిరెడ్డిని మానసిక క్షోభకు గురిచేసిందెవరు.. జగన్ కాదా..’ అని ప్రశ్నించారు. ‘్భమాకు మంత్రిపదవి ఇవ్వవద్దని వాళ్లే గవర్నర్ దగ్గరకు వెళతారు. ఇప్పుడేమో మంత్రిపదవి రానందుకు మానసికక్షోభతో చనిపోయారని విమర్శిస్తున్నారు. ఇందులో ఏమైనా అర్థం ఉందా.. మీరు కూడా ఆలోచించాలి. వాళ్లు అడిగినవన్నీ నన్ను అడగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అఖిలప్రియను తాము సభకు తీసుకువచ్చామన్నది అవాస్తవమన్నారు. ‘ఆమె తనంతట తాను వచ్చింది. మేమెవరం రమ్మనలేదు. అయినా చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని సభ్యులు కూడా మెచ్చుకున్నారు’ అన్నారు. నంద్యాలలో పోటీ చేస్తానని జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా, ‘ఏముంది పోటీ చేసుకోమనండి. అయినా మీరు అక్కడ వాళ్లకు ఒకటి, ఇక్కడ మాకు రెండు చెబుతున్నారు’ అన్నారు. ఎమ్మెల్యేలు తమ ఆరోగ్యాలు చూసుకోవడం లేదని, గతంలో మీరు యోగా శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఓ విలేకరి గుర్తు చేయగా, ‘మళ్లీ పెడదాం. వాళ్లతోటు మీకూ పెడతా’మని నవ్వుతూ వెళ్లిపోయారు.