ఆంధ్రప్రదేశ్‌

ప్రగతి సాగు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.18,214కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రుణమాఫీకి 3వేల కోట్లు 6040కోట్లతో ఉపాధి హామీ అనుసంధానం
రైతుబంధుకు 18కోట్లు ఉద్యానరంగంలో 25 శాతం వృద్ధిరేటు లక్ష్యం
301 కోట్లతో పంటల బీమా

గుంటూరు, మార్చి 15: రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లో కొత్తదనమేమీ కనిపించలేదు.. రూ. 18వేల 214 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మండలిలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు బుధవారం ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సరానికి ప్రణాళికా వ్యయం 1170 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం కింద 4355 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. సూక్ష్మపోషక లోపాల సవరణ, సమగ్ర పోషక యాజమాన్య పథకానికి రూ. 61కోట్లు, పంటలలో సుస్థిర దిగుబడిని సాధించేందుకు వివిధ నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేసేందుకు మరో పది కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. సేంద్రీయ వ్యవసాయానికి 25కోట్లు, క్షేత్రస్థాయిలో సామర్ధ్యం పెంపుదలకు 62 కోట్ల మేర బడ్జెట్‌లో పొందుపరిచారు. పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణకు 17 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులను నిల్వచేస్తూ పంట సమయంలో అవసరమైన మొత్తంలో ఎరువులను సకాలంలో సరఫరా చేసేందుకు మండల, జిల్లా స్థాయిలో భవన నిర్మాణాలకు రూ. 5కోట్లు, వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాలలో మూల విత్తన ఉత్పత్తికి గాను రూ.220కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. లక్ష రూపాయల వరకు తీసుకున్న పంట రుణం తిరిగి చెల్లిస్తే రైతులకు వడ్డీలేని పంట రుణాల సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకు గాను బడ్జెట్‌లో 172 కోట్లు కేటాయించారు. లక్ష నుండి మూడు లక్షల వరకు రుణాలు పొందిన రైతులకు పావలా వడ్డీ కోసం 5కోట్లు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా కేంద్ర భాగస్వామ్యంతో 40శాతం ప్రభుత్వ వాటాతో కలిపి 301 కోట్లతో అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడో విడత రుణ ఉపశమనం కింద రూ.3600 కోట్లు ప్రతిపాదించారు. ఆధునిక, సాంకేతిక పద్ధతులతో వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. రెండు కొత్త వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను కృష్ణాజిల్లా ఘంటసాల, అనంతపురం జిల్లా రామగిరిలో ప్రారంభించింది. కళాశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ.175 కోట్లు, పరిశోధనా కేంద్రాల అభివృద్ధికి మరో 86కోట్లు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వౌలిక సదుపాయాల విస్తరణకు రూ.23 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ 308కోట్లతో ప్రతిపాదించారు. ప్రాథమికరంగ మిషన్‌లో వృద్ధికి దోహదపడే ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచి మూడేళ్లలో 20 నుంచి 35శాతానికి వృద్ధిరేటు పెంచటమే బడ్జెట్ ప్రధానలక్ష్యంగా వివరించారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమయ్యే ఉద్యానవన ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఏపిఇడిఎ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. టమోటా, కూరగాయలు, మామిడి పసుపు తదితర వాణిజ్య పంటలకు అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు సిమ్‌ఫెడ్, జైకా వంటి సంస్థలకు ప్రతిపాదనలు సమర్పించింది. ఉద్యానవన పంటల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.96కోట్ల కేంద్ర ప్రాయోజిత రాష్ట్ర పథకాల కింద చేర్చారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 717 కోట్లమేర కేటాయింపులు జరిపారు. పట్టుపరిశ్రమ రూ.160 కోట్లు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాల, మూడు ప్రైవేటు కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు ప్రారంభించనున్నారు. చిన్నజీవాల అభివృద్ధి విధానం అమలుకు 584కోట్లు, కోళ్ల అభివృద్ధి విధానం అమలుకు 575 కోట్లతో వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వర్షాభావ పరిస్థితులలో పసుగ్రాసం నిల్వ చేసేందుకు మూడు ప్రాంతాల్లో గిడ్డంగులను ఏర్పాటుచేస్తారు. మత్స్యశాఖ నిర్దేశించిన 30 శాతం వృద్ధిరేటు సాధన కోసం ఆ శాఖకు రూ. 282 కోట్లు, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 4వేల చొప్పున అందించేందుకు రూ.30కోట్లు, పడవలపై వాడే డీజిల్ ఆయిల్‌పై అమ్మకం పన్నును రూ.12కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. 2017-18 సంవత్సరంలో విద్యుత్ సబ్సిడీ కింద 3300 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధిహామీ పథకం అమలుకు 6040కోట్లు ప్రతిపాదించారు. రెండోవిడతగా 380ప్రాథమిక పరపతి సంఘాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ. 17 కోట్లు కేటాయించారు.

చిత్రం... అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు