ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై గరం.. గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కృష్ణాకు గోదావరి జలాల తరలింపు.. అదేదో తమ ఘనకార్యంగా తెలుగుదేశం ప్రభుత్వం గొప్పలు చెప్పుకోటం హాస్యాస్పదం.. జాతీయ హోదా యుపిఎ ప్రభుత్వం పుణ్యం.. గోదావరి జలాల తరలింపునకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆద్యుడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా గురువారం పోలవరంపై అరగంటకు పైగా వాడి, వేడి చర్చ జరిగింది. చర్చలో జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎంతో కాలం కాగితాలపైనే ఉంది.. దివంగత వైఎస్ మొండిగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. కుడి కాలువ తవ్వటం వల్లనే గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా ఆ కాలువ నుంచి కృష్ణాకు మళ్లించగల్గుతున్నారు. అదేదో తమ ఘనత.. చంద్రబాబు అపర భగీరథుడు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేసారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి యుపిఎ ప్రభుత్వం తమ చివరి మంత్రివర్గ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తూ తీర్మానించి, దానిని రాష్టప్రతికి పంపించింది. అయితే నేడు ఎన్‌డిఎ ప్రభుత్వం నాటి అంచనాల ప్రకారం రూ.16వేల కోట్లకు మించి భరించేది లేదని చెబుతోంది.. పైగా విద్యుత్ ఉత్పాదన, మంచినీటి పథకానికి ఖర్చు భరించేది లేదంటున్నది.. 2014కు ముందు రూ.5వేల 500 కోట్లు ఖర్చు అయితే గడచిన మూడేళ్లలో 3వేల 300 కోట్ల రూపాయలకు మించి ఖర్చు కాలేదు.. ఇక కేంద్రం నుంచి రూ.7వేల 500 కోట్లకు మించి వచ్చేలా కన్పించటం లేదు.. మరోవైపు చూస్తే ప్రాజెక్ట్ వ్యయం రూ.30వేల కోట్లు దాటగలదంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి కాగలదంటూ జగన్ ధ్వజమెత్తారు.
ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, డాక్టర్ వల్లభనేని వంశీ, కలిదిండి సన్యాసిరాజు అడిగిన ప్రశ్నలపై అరగంటపైగా చర్చ జరిగింది. తొలుత జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం మొత్తాన్ని నూటికి నూరు శాతం కేంద్రం భరిస్తుంది. నాబార్డు నుంచి రుణం అందించేందుకు పచ్చజెండా ఊపిందన్నారు.
ఇప్పటివరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా లభించగా, ఏ ప్రాజెక్ట్‌కు కూడా కేంద్రం నయాపైసా నిధులు విదల్చలేదంటూ వివరించారు. చంద్రబాబు పట్టుదలతోనే కేంద్రం నుంచి భారీగా నిధులు వరదలా ప్రవహిస్తున్నాయని అన్నారు. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 నాటికి గ్రావెటీతో గోదావరి జలాలు ప్రవహిస్తాయన్నారు. 2019 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాగలదంటూ గట్టిగా బల్లచరచి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.16వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లకు పెరగడానికి జగనే కారణమంటూ మంత్రి ఉమా ఆగ్రహించారు. 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చినందువల్ల కూడా అంచనాలు పెరిగాయన్నారు.
బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించినా, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినా ప్రతిపక్షం కనీసం కృతజ్ఞతలు తెలుపకపోవటం బాధాకరమన్నారు. ఆ పార్టీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వల్ల రాజమండ్రికి ముంపు బెడద తప్పనుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ వలనే జాతీయ హోదా లభించిందన్నారు. జగన్ కల్పించుకుంటూ ఈ ప్రాజెక్ట్ కోసం తెదేపా, బిజెపిలు చేసిందేమీ లేదన్నారు.

చిత్రం..దేవినేని ఉమామహేశ్వరరావు